Team India Fine : బంగ్లాదేశ్ చేతిలో ఓడిన టీమిండియాకు మరో బ్యాడ్ న్యూస్

బంగ్లాదేశ్ తో తొలి వన్డే మ్యాచ్ లో చెత్త ఫీల్డింగ్ తో ఓటమి చవిచూసిన భారత జట్టుకు మరో బ్యాడ్ న్యూస్. స్లో ఓవర్ రేట్ కారణంగా భారత ప్లేయర్లకు మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగలె రూ.52.8 లక్షల జరిమానా విధించారు.

Team India Fine : బంగ్లాదేశ్ చేతిలో ఓడిన టీమిండియాకు మరో బ్యాడ్ న్యూస్

Team India Fine : బంగ్లాదేశ్ తో తొలి వన్డే మ్యాచ్ లో చెత్త ఫీల్డింగ్ తో ఓటమి చవిచూసిన భారత జట్టుకు మరో బ్యాడ్ న్యూస్. స్లో ఓవర్ రేట్ కారణంగా భారత ప్లేయర్లకు మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగలె రూ.52.8 లక్షల జరిమానా విధించారు. టార్గెట్ కంటే 4 ఓవర్లు తక్కువగా వేసినందుకు మన ప్లేయర్ల ఫీజులో 80శాతం ఫైన్ వేయగా.. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తప్పును అంగీకరించడంతో ఫైన్ ను అమలు చేశారు.

”ICC ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం, ఆటగాళ్లు తమ జట్టు నిర్ణీత సమయంలో బౌలింగ్ చేయడంలో విఫలమైన ప్రతి ఓవర్‌కు వారి మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించబడుతుంది” అని ఓ ప్రకటనలో ఐసీసీ తెలిపింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ నేరాన్ని అంగీకరించాడు, ప్రతిపాదిత అనుమతిని అంగీకరించాడు. కాబట్టి అధికారిక విచారణ అవసరం లేదు” అని ఐసీసీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

Also Read..lndia vs Bangladesh: బంగ్లా జట్టుపై టీమిండియా ఓటమికి కారణం ఏమిటి? కెప్టెన్ రోహిత్ శర్మ ఏమన్నాడంటే.

కాగా, మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నిన్న బంగ్లాదేశ్, భారత్ తలపడ్డాయి. ఆల్‌రౌండ్‌ వైఫల్యంతో భారత్‌ పరాజయం పాలైంది. హోరాహోరీగా సాగిన లో స్కోరింగ్‌ మ్యాచ్‌లో బంగ్లా వికెట్‌ తేడాతో గెలుపొందింది. చెత్త ఫీల్డింగ్ తో రోహిత్ సేన మూల్యం చెల్లించుకుంది.

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 41.2 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కేఎల్‌ రాహుల్‌ (73.. 5 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా.. రోహిత్‌ (27), శ్రేయస్‌ (24) , సుందర్‌ (19) పరుగులు చేశారు. శిఖర్‌ ధవన్‌ (7), కోహ్లీ (9) విఫలమయ్యారు.

బంగ్లా బౌలర్లలో షకీబ్‌ 5, ఇబాదత్‌ 4 వికెట్లు అదరగొట్టారు. లక్ష్యఛేదనలో బంగ్లా 46 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 187 రన్స్‌ చేసింది. కెప్టెన్‌ లిటన్‌ దాస్‌ (41), మెహదీ హసన్‌ మిరాజ్‌ (38 నాటౌట్‌) రాణించారు. సిరాజ్‌ మూడు వికెట్లు తీశాడు. అరంగేట్ర పేసర్‌ కుల్దీప్‌ సేన్‌, సుందర్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

Also Read..Team India: టీ20 ఫార్మాట్‌కు కొత్త కోచ్..? రాహుల్‌ను పక్కన పెట్టే యోచనలో బీసీసీఐ ..

ఒంటి చేత్తో బంగ్లాను గెలిపించిన మెహదీకి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. 187 పరుగుల లక్ష్యఛేదనలో 136 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన బంగ్లా.. చివరి వికెట్‌కు రికార్డు స్థాయిలో 51 పరుగులు జోడించింది. ఈ క్రమంలో మెహదీ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను రాహుల్‌ వదిలేయగా.. అంతకుముందు రోహిత్‌, సుందర్‌ కూడా తేలికైన క్యాచ్‌లు పట్టడంలో విఫలమయ్యారు. బంగ్లా విజయానికి, భారత్ ఓటమికి చెత్త ఫీల్డింగ్ ప్రధాన కారణం అని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ అద్భుతంగా ఆడిందని చెప్పుకోవడానికి బదులు భారత జట్టే తమ పేలవమైన ఫీల్డింగ్‌తో ఆతిథ్య జట్టుని గెలిపించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆటగాళ్లు ఫీల్డింగ్‌లో పూర్తిగా నిరాశపరిచారు. క్యాచ్‌లు జారవిడడంతో పాటు ఓవర్‌త్రోలతో చేజేతులా మ్యాచ్‌ను ప్రత్యర్థికి అప్పగించారు. ఎప్పటిలాగే డెత్‌ బౌలింగ్‌ గండం మరోసారి టీమిండియాను వెక్కిరించింది. చివరి వికెట్‌ తీసేందుకు భారత బౌలర్లు ఆపసోపాలు పడ్డారు. దీనికి తోడు ఫీల్డింగ్‌ వైఫల్యం ఆతిథ్య జట్టుకు బాగా కలిసొచ్చింది. కేఎల్ రాహుల్ వదిలేసిన ఈజీ క్యాచ్.. భారత్ ఓటమికి ప్రధాన కారణమైంది.