Team India: టీ20 ఫార్మాట్‌కు కొత్త కోచ్..? రాహుల్‌ను పక్కన పెట్టే యోచనలో బీసీసీఐ ..

ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ అనంతరం టీ20 ఫార్మాట్ కు ప్రత్యేక కోచ్ ను తీసుకురావాలని బీసీసీఐ పరిశీలిస్తోంది. టీమిండియా బిజీ షెడ్యూల్ వల్ల ఆటగాళ్లకే కాదు, సపోర్టింగ్ స్టాప్‌కు కూడా తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో రాహుల్ ద్రవిడ్ పై సైతం ఒత్తిడి పెరుగుతోంది. దీంతో రాహుల్ ద్రవిడ్ ను టీ20 ఫార్మాట్ నుంచి తప్పించి కేవలం వన్డేలు, టెస్టులపైనే దృష్టి కేంద్రీకరించేలా చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Team India: టీ20 ఫార్మాట్‌కు కొత్త కోచ్..? రాహుల్‌ను పక్కన పెట్టే యోచనలో బీసీసీఐ ..

Rahul Dravid

Team India: రానున్న రోజుల్లో టీమ్ ఇండియాలో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయా? వరుస మ్యాచ్ ల ఓటమితో బీసీసీఐ కీలక మార్పులకు శ్రీకారం చుడుతుందా అంటే.. బోర్డు అధికారుల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో ఆటతీరును మార్చాలని బీసీసీఐ దృష్టిపెట్టింది. ఈ సందర్భంగా టీ20 ఫార్మాట్ కు ప్రత్యేక కెప్టెన్, కోచ్‌లను నియమించాలనే యోచన చేస్తున్నట్లు సమాచారం. 2022టీ20 ప్రపంచ కప్ టోర్నీలో టీమ్ ఇండియా ఓటమి తరువాత బీసీసీఐ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ముందుకు కొత్త సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేయాలని బీసీసీఐ ప్రయత్నాలు ప్రారంభించిందని విశ్వసనీయ సమాచారం.

BCCI’s Big Announcement: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్‌ ఫీజులు

ఇన్‌సైడ్ స్పోర్ట్స్ నివేదిక ప్రకారం.. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ అనంతరం టీ20 ఫార్మాట్ కు ప్రత్యేక కోచ్ ను తీసుకురావాలని బీసీసీఐ పరిశీలిస్తోంది. టీమిండియా బిజీ షెడ్యూల్ వల్ల ఆటగాళ్లకే కాదు, సపోర్టింగ్ స్టాప్‌కు కూడా తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో రాహుల్ ద్రవిడ్ పై సైతం ఒత్తిడి పెరుగుతోంది. దీంతో రాహుల్ ద్రవిడ్ ను టీ20 ఫార్మాట్ నుంచి తప్పించి కేవలం వన్డేలు, టెస్టులపైనే దృష్టి కేంద్రీకరించేలా చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Rahul Dravid: కోహ్లీ హోటల్ గది వీడియోపై స్పందించిన ద్రవిడ్.. ఆటగాళ్లకు కీలక సూచన

ఈ విషయంపై బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ.. టీ20 ఫార్మాట్ కు ప్రత్యేక కోచ్ ను తీసుకురావాలా? వద్దా అని బోర్డు పరిశీలిస్తోందని అన్నారు. ఇందులో రాహుల్ ద్రవిడ్ గురించి ప్రస్తావన లేదని తెలిపారు. అయితే, బిజీబిజీ షెడ్యూల్ వల్ల అన్ని ఫార్మాట్లలో పనిచేయడం ఒత్తిడితో కూడుకున్న పనిఅని, ఈ క్రమంలో ప్రత్యేక బృందాన్ని సిద్ధం చేసే పనిలో బీసీసీఐ నిమగ్నమైందని అన్నారు. టీ20 షెడ్యూల్ మున్ముందు ఎక్కువగా ఉండే అవకాశాల నేపథ్యంలో మార్పులు తప్పనిసరిగా ఉంటాయని ఆయన అన్నారు.

Bangladesh vs India: ఒక్క వికెట్ తేడాతో టీమిండియాపై గెలిచిన బంగ్లాదేశ్

టీ20 ప్రపంచకప్ 2021 తరువాత రాహుల్ ద్రవిడ్ ను టీమ్ ఇండియా కోచ్ గా నియమించారు. ద్రవిడ్ నాయకత్వంలో టీమ్ ఇండియా అనేక వరుస ద్వైపాక్షిక సిరీస్ లను గెలుచుకుంది. కానీ బహుళజాతి టోర్నమెంట్ లో అదేవిధంగా చేయలేకపోయింది. ఆసియా కప్, టీ20 ప్రపంచ కప్-2022లో టీమ్ ఇండియా ఓటమి తర్వాత బీసీసీఐ కొత్త మార్గాలను అన్వేషిస్తుంది. అన్నిఅనుకూలిస్తే టీ20 ఫార్మాట్ కు కొత్త కోచ్, కెప్టెన్ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.