Rahul Dravid: కోహ్లీ హోటల్ గది వీడియోపై స్పందించిన ద్రవిడ్.. ఆటగాళ్లకు కీలక సూచన

టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కోహ్లీ హోటల్ వీడియో ఘటనపై స్పందించారు. మీడియా, అభిమానులు, ఫొటోగ్రాఫ్ ల నుంచి ఆటగాళ్లు కాస్త విరామం పొందేది, సురక్షితంగా భావించేది ఇక్కడే. అలాంటి హోటల్ గదిలో కూడా వీరికి ఇలాంటి అనుభవం ఎదురుకావటం సరైన చర్య కాదు.

Rahul Dravid: కోహ్లీ హోటల్ గది వీడియోపై స్పందించిన ద్రవిడ్.. ఆటగాళ్లకు కీలక సూచన

Rahul dravid

Rahul Dravid: ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచ కప్ టోర్నీలో పెర్త్‌లో జరిగిన మ్యాచ్ కోసం ఓ హోటల్‌లో టీమిండియా ఆటగాళ్లకు అతిథ్యం ఏర్పాటు చేసిన విషయం విధితమే. అయితే టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీకి కేటాయించిన గదిలోకి వెళ్లి హోటల్ పనిచేసే కొందరు వ్యక్తులు వీడియో తీశారు. దానిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆ వీడియో వైరల్ అయింది. దీనిపై కోహ్లీ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి పద్దతి సరైంది కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై హోటల్ యాజమాన్యం స్పందించి కోహ్లీకి క్షమాపణలు చెప్పింది. బాధ్యులను విధుల నుంచి తొలగించింది.

Virat Kohli: కోహ్లీ హోటల్ రూమ్ దృశ్యాలు లీక్.. వీడియో పోస్ట్ చేసి ఆగ్రహం వ్యక్తం చేసిన విరాట్

కోహ్లీకి ఇటువంటి చేదు అనుభవం ఎదురవడంపై సీనియర్ ఆటగాళ్లు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలాఉంటే ఈ ఘటనపై టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించారు. ఈ చర్యను తీవ్రంగా తప్పుబట్టాడు. కోహ్లీకే కాదు ఇలాంటి ఘటనలు ఎవరికైనా అసౌకర్యానికి గురిచేస్తాయని, ఈ ఘటనను మేం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాం, వారు చర్యలు తీసుకున్నారని అన్నారు.

Virat Kohli: విరాట్ కోహ్లీ హోటల్ రూమ్ వీడియో లీక్.. క్షమాపణలు చెప్పిన హోటల్ యాజమాన్యం

ఈ సందర్భంగా ద్రవిడ్ టీమిండియా ఆటగాళ్లకు కీలక సూచనలు చేశారు. హోటల్ గదిలో బసచేసేటప్పుడు ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. మీడియా, అభిమానులు, ఫొటోగ్రాఫ్ ల నుంచి ఆటగాళ్లు కాస్త విరామం పొందేది, సురక్షితంగా భావించేది ఇక్కడే. అలాంటి హోటల్ గదిలో కూడా వీరికి ఇలాంటి అనుభవం ఎదురుకావటం సరైన చర్య కాదు. హోటల్ గదిలో ఉండే సమయంలో ఆటగాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ద్రవిడ్ అన్నారు.