ఐపీఎల్ జట్లకు పెద్ద షాక్: మ్యాచ్‌లకు దూరమైన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆటగాళ్ళు

  • Published By: vamsi ,Published On : September 8, 2020 / 10:04 AM IST
ఐపీఎల్ జట్లకు పెద్ద షాక్: మ్యాచ్‌లకు దూరమైన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆటగాళ్ళు

మరో వారం పది రోజులకు మధ్యలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్ మొదలు కాబోతుంది. ఈసారి ఐపీఎల్ సందడి అంతా యూఏఈలో జరుగుతుండగా.. లేటెస్ట్‌గా 13 వ సీజన్ గురించి పెద్ద అప్‌డేట్.. జట్లకు షాకింగ్ విషయం బయటకు వస్తుంది. ఐపిఎల్ పాలక మండలి బయో బబుల్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆటగాళ్లకు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. పాలక మండలి నిర్ణయం ప్రకారం ఈ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆటగాళ్ళు ఐపిఎల్ ప్రారంభ వారంలో ఐపీఎల్‌లో పాల్గొనలేరు.



ప్రస్తుతం ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ జరుగుతోండగా.. ఈ సిరీస్ చివరి మ్యాచ్ సెప్టెంబర్ 16వ తేదీన జరుగుతుంది. సిరీస్ ముగిసిన ఒక రోజు లేదా రెండు రోజుల తరువాత, ఈ రెండు దేశాల నుంచి ఆటగాళ్ళు యూఏఈకి వెళ్తారు. అప్పుడు 6 రోజులు క్వారంటైన్‌లో ఉండవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, సెప్టెంబర్ 24 వరకు ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ ఆటగాళ్ళు మైదానంలోకి వచ్చే అవకాశం లేదు.

క్వారంటైన్ కాలంలో రెండు మూడు సార్లు ఆటగాళ్లకు కరోనా పరీక్ష ఉంటుంది. ఆటగాళ్ల నివేదికలు నెగెటివ్‌గా వచ్చిన తర్వాతే వారికి జట్లలో చేరే అవకాశం లభిస్తుంది. పాలకమండలి నిర్ణయం కారణంగా, ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ ఆటగాళ్ళు ఆడే జట్లు, అవి లేకుండా ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు ఆడవలసి ఉంటుంది.



ఐపీఎల్ జట్లకు స్టీవ్ స్మిత్, జోస్ బట్లర్, డేవిడ్ వార్నర్, బెన్ స్టోక్స్, మాక్స్‌వెల్ సహా 17 నుంచి 18 మంది ఆటగాళ్ళు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. అంతే కాదు, ప్రారంభ మ్యాచ్‌లలో వార్నర్ మరియు స్మిత్ అందుబాటులో లేనందున, ఈ జట్లు కొత్త కెప్టెన్‌లను తీసుకోవలసి ఉంటుంది ఎందుకంటే ఈ సీజన్‌లో ఈ ఇద్దరు ఆటగాళ్ళు రాజస్థాన్ మరియు హైదరాబాద్‌ జట్లకు కెప్టెన్లుగా ఉన్నారు.

జట్లలో ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ ఆటగాళ్ళు ఎంతమంది ఉన్నారంటే?

చెన్నై సూపర్ కింగ్స్: సామ్ కరెన్, జోస్ హగేవుడ్



ఢిల్లీ క్యాపిటల్స్: అలెక్స్ కారీ, స్టోయినిస్
https://10tv.in/players-list-of-royal-challengers-bangalore-rcb-team-for-ipl-2020/
కోల్‌కతా నైట్ రైడర్స్: పాట్ కమ్మిన్స్, ఇయాన్ మోర్గాన్

కింగ్స్ ఎలెవన్ పంజాబ్: క్రిస్ జోర్డాన్, మాక్స్‌వెల్



సన్‌రైజర్స్ హైదరాబాద్: బెయిర్‌స్టో, డేవిడ్ వార్నర్

రాజస్థాన్ రాయల్స్: జోఫ్రా ఆర్చర్, స్మిత్, టామ్ కురెన్, బెన్ స్టోక్స్, ఆండ్రూ టాయ్



రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: మోయిన్ అలీ, ఆరోన్ ఫించ్, ఆడమ్ జంపా