ఆ స్టేడియంలో మ్యాచ్ ఆడే వరకూ ఆగలేకపోతున్నా: రోహిత్ శర్మ

ఆ స్టేడియంలో మ్యాచ్ ఆడే వరకూ ఆగలేకపోతున్నా:  రోహిత్ శర్మ

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ కివీస్ పర్యటన నుంచి విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ హిట్ మాన్ ఆటకు వారాల కొద్దీ గ్యాప్ రావడంతో అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. శుక్రవారం నుంచి కివీస్‌తో జరగబోయే టెస్టు ఫార్మాట్‌లోనూ రోహిత్ ఆడడం లేదు.  

రోహిత్ తన ట్వీట్ ద్వారా అక్కడ మ్యాచ్ ఆడేందుకు ఆగలేకపోతున్నా అంటూ పోస్టు పెట్టాడు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో రెడీ అవుతున్న మోటెరా స్టేడియంలో ఆడేందుకు ఉత్సుకతతో ఉన్నాడట. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేతుల మీదుగా స్టేడియం ఓపెనింగ్ చేయించాలని ప్రధాని మోడీ ప్లాన్ చేశారు. 

‘ఈ స్టేడియం గురించి విని అద్భుతంగా అనిపించింది. అక్కడ ఆడాలని మనసు ఆగడం లేదు’ అంటూ బీసీసీఐని ట్యాగ్ చేసి రోహిత్ పోస్టు పెట్టాడు. 

టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి అతి పెద్ద స్టేడియమంటూ అంటూ పొగడ్తలు కురిపించాడు. ‘చూడడానికి అత్యద్భుతంగా ఉంది. ప్రతి భారత క్రికెట్ ప్రేమికుడికి ఇదెంతగానో నచ్చుతుంది. లక్షా 11వేల మందికి పైగా అభిమానులు ఒకేసారి కూర్చొని మ్యాచ్ చూడొచ్చు. అని అమిత్ షా కొడుకుని ట్యాగ్ చేస్తూ పోస్టు పెట్టాడు.

ఈ స్టేడియం ప్రారంభమైతే ప్రపంచంలోనే అతి పెద్ద గ్రౌండ్‌గా పేరున్న ఆస్ట్రేలియాలోని 
మెల్‌బౌర్న్ క్రికెట్ గ్రౌండ్ వెనక్కిపడిపోయినట్లే. భారత్‌లో ఇప్పటివరకూ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియమే 66వేల మంది సీటింగ్ తో అతిపెద్దగా ఉంది. 

Read More>>కరోనా వైరస్‌కు ఇనుప సంకెళ్లు! : ఇళ్లకు చెక్కలు పెట్టి మేకులు కొట్టేస్తున్నారు..!!