మూడో వన్డేతో సహా టీ20 సిరీస్‌కు వార్నర్ దూరం

David Warner ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ టీమిండియాతో జరిగే తర్వాతి మ్యాచ్ మూడో వన్డేకు దూరం కానున్నాడు. అంతేకాకుండా టీ20 సిరీస్ కూడా అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించడం లేదు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో గాయంతో విలవిలలాడాడు. డిసెంబర్ 17నుంచి జరగనున్న టెస్టు సిరీస్ నాటికి కోలుకుంటాడనే ఆశాభావం వ్యక్తం చేస్తుంది మేనేజ్మెంట్. అతని స్థానంలో D’Arcy Shortను తీసుకోనున్నట్లు సమాచారం. ఆస్ట్రేలియా టీ20 బిగ్ బాష్ లీగ్ లో ఫామ్ కనబరిచి అద్భుతమైన స్కోరు సాధించడంతో అతనికే మొగ్గు చూపుతున్నారు. దాంతో పాటు మూడో వన్డేలో పేసర్ పాట్ కమిన్స్ కు రెస్ట్ ఇచ్చి టెస్టు సిరీస్ కు క్రికెట్ ఆస్ట్రేలియా సోమవారం చెప్పింది. https://10tv.in/australia-beat-india-by-51-runs-to-take-2-0-unbeatable-series-lead/ ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ మాట్లాడుతూ.. వార్నర్, కమిన్స్ లు టెస్టుల నాటికి అందుబాటులో ఉంటారని ఆశిస్తున్నట్లు చెప్పాడు. 'ఇద్దరూ ఫుల్ ప్రిపేర్ గా ఉండాలని సొంతగడ్డపై జరిగే టెస్టు మ్యాచ్ లలో ఆడతారని కోరుకుంటున్నా. ప్రత్యేకించి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ కు రెడీ అవ్వాలి' అని అన్నారు.