India-Pakistan Match: బయటకు రావద్దు.. భారత్-పాక్ మ్యాచ్‌ను గుంపులుగా చూశారో.. విద్యార్థులకు వార్నింగ్ ఇచ్చిన కాలేజ్

నేటి భారత్-పాక్ మ్యాచ్‌ను గుంపులు గుంపులుగా చూడొద్దని విద్యార్థులకు జమ్మూకశ్మీర్‌, శ్రీనగర్ లోని ఓ కాలేజ్ వార్నింగ్ ఇచ్చింది. అలాగే, ఆ మ్యాచు గురించి సామాజిక మాధ్యమాల్లోనూ ఎటువంటి పోస్టులూ చేయొద్దని చెప్పింది. విద్యార్థుల సంక్షేమం కోసమే తాము ఈ నోటీసులు జారీ చేస్తున్నామని చెప్పింది. మ్యాచు జరుగుతోన్న సమయంలో విద్యార్థులు తమకు కేటాయించిన గదుల్లోనే ఉండాలని పేర్కొంది. ఇతర విద్యార్థులు ఉంటోన్న గదుల్లోకి వెళ్ళకూడదని హెచ్చరించింది.

India-Pakistan Match: బయటకు రావద్దు.. భారత్-పాక్ మ్యాచ్‌ను గుంపులుగా చూశారో.. విద్యార్థులకు వార్నింగ్ ఇచ్చిన కాలేజ్

India-Pakistan Match

India-Pakistan Match: నేటి భారత్-పాక్ మ్యాచ్‌ను గుంపులు గుంపులుగా చూడొద్దని విద్యార్థులకు జమ్మూకశ్మీర్‌, శ్రీనగర్ లోని ఓ కాలేజ్ వార్నింగ్ ఇచ్చింది. అలాగే, ఆ మ్యాచు గురించి సామాజిక మాధ్యమాల్లోనూ ఎటువంటి పోస్టులూ చేయొద్దని చెప్పింది. విద్యార్థుల సంక్షేమం కోసమే తాము ఈ నోటీసులు జారీ చేస్తున్నామని చెప్పింది. మ్యాచు జరుగుతోన్న సమయంలో విద్యార్థులు తమకు కేటాయించిన గదుల్లోనే ఉండాలని పేర్కొంది. ఇతర విద్యార్థులు ఉంటోన్న గదుల్లోకి వెళ్ళకూడదని హెచ్చరించింది.

శ్రీనగర్ లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) ఈ నోటీసు జారీ చేసింది. దుబాయిలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మ్యాచు జరుగుతున్న నేపథ్యంలో ఈ మ్యాచును క్రీడా స్ఫూర్తితోనే చూడాలని, ఇన్‌స్టిట్యూట్, హాస్టల్ లో ఎటువంటి క్రమశిక్షణారాహిత్య చర్యలకూ పాల్పడవద్దని సూచించింది. ఒకవేళ విద్యార్థులు ఇతర గదుల్లోకి వెళ్ళి గుంపులుగా మ్యాచ్ చూస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

తమ ఆదేశాలను లెక్కచేయకుండా గుంపులుగా మ్యాచ్ చూసే విద్యార్థులకు ఇకపై హాస్టల్ వసతి అందకుండా చేయడంతో పాటు రూ.5 వేల రూపాయల జరిమానా విధిస్తామని పేర్కొంది. మ్యాచ్ జరుగుతోన్న సమయంతో పాటు మ్యాచ్ ముగిశాక కూడా విద్యార్థులు బయటకు రావద్దని చెప్పింది. కాగా, 2016లో వెస్టిండీస్ తో జరిగిన టీ-20 మ్యాచులో భారత్ ఓడిపోగానే ఆ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులకు-ఇతర విద్యార్థులకు మధ్య ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. దీంతో అప్పట్లో కొన్ని రోజుల పాటు ఎన్ఐటీని మూసేయాల్సి వచ్చింది.

Asia Cup 2022: కరోనా నుంచి కోలుకుని దుబాయి వెళ్ళిన ద్రవిడ్.. నేటి భారత్-పాక్ మ్యాచ్‌ చూడనున్న కోచ్