Asia Cup 2022: కరోనా నుంచి కోలుకుని దుబాయి వెళ్ళిన ద్రవిడ్.. నేటి భారత్-పాక్ మ్యాచ్‌ చూడనున్న కోచ్

టీమిండియా చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కరోనా నుంచి కోలుకున్నారు. యూఏఈలో జరుగుతోన్న ఆసియా కప్ లో పాల్గొనేందుకు టీమిండియా బయలుదేరిన సమయంలో ద్రవివ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ద్రవివ్ యూఏఈకి వెళ్ళలేదు. హోం ఐసోలేషన్ లోనే చికిత్స తీసుకున్నారు. దీంతో ఎన్సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ ను బీసీసీఐ టీమిండియా తాత్కాలిక కోచ్ గా నియమించింది. అయితే, ఇప్పుడు ద్రవిడ్ కు నెగిటివ్ రావడంతో యూఏఈ వెళ్ళారు.

Asia Cup 2022: కరోనా నుంచి కోలుకుని దుబాయి వెళ్ళిన ద్రవిడ్.. నేటి భారత్-పాక్ మ్యాచ్‌ చూడనున్న కోచ్

Asia Cup 2022

Asia Cup 2022: టీమిండియా చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కరోనా నుంచి కోలుకున్నారు. యూఏఈలో జరుగుతోన్న ఆసియా కప్ లో పాల్గొనేందుకు టీమిండియా బయలుదేరిన సమయంలో ద్రవివ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ద్రవిడ్ యూఏఈకి వెళ్ళలేదు. హోం ఐసోలేషన్ లోనే చికిత్స తీసుకున్నారు. దీంతో ఎన్సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ ను బీసీసీఐ టీమిండియా తాత్కాలిక కోచ్ గా నియమించింది. అయితే, ఇప్పుడు ద్రవిడ్ కు నెగిటివ్ రావడంతో యూఏఈ వెళ్ళారు.

‘‘రాహుల్ ద్రవిడ్ బీసీసీఐ వైద్య బృంద పర్యవేక్షణలో ఉన్నారు. ఆయనకు తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయి. ఆయనకు నెగెటివ్ నిర్ధారణ కాగానే టీమిండియాను కలుస్తారు’’ అని ఇటీవలే బీసీసీఐ సెక్రటరీ జై షా ఓ ప్రకటన చేశారు. ద్రవిడ్ కి నెగెటివ్ వచ్చిన నేపథ్యంలో ఆయన దుబాయి వెళ్ళి హోటల్ లో భారత క్రికెటర్లను కలిశారు. ఇవాళ జరగనున్న భారత్-పాకిస్థాన్ టీ20 మ్యాచును చూడడానికి ఆయన స్టేడియం వెళ్ళనున్నారు.

కాగా, దుబాయిలో ఈ మ్యాచు జరగనుంది. ఆసియా కప్ ను టీ20 ఫార్మాట్ లో నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. నేటితో కొహ్లీ 100 టీ20 మ్యాచులు ఆడిన క్రికెటర్ గా నిలవనున్నాడు. అంతేగాక, అన్ని ఫార్మాట్లలో 100 మ్యాచులు పూర్తి చేసుకున్న మొట్టమొదటి భారత క్రికెటర్ గా రికార్డు నెలకొల్పనున్నాడు.

Chinese construction work: మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడుతోన్న చైనా.. అరుణాచల్‌ ప్రదేశ్‌లో నిర్మాణాలు?