Hockey World Cup 2023: పురుషుల హాకీ ప్రపంచ కప్ విజేత జర్మనీ.. ఫైనల్‌లో బెల్జియంపై గెలుపు

ఆదివారం సాయంత్రం జరిగిన ఫైనల్‌లో బెల్జియం జట్టుపై పెనాల్టీ షూటౌట్‌లో జర్మనీ విజయం సాధించింది. ఫైనల్ ఉత్కంఠగా సాగి అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన బెల్జియం జట్టును జర్మనీ ఓడించింది. ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఈ టోర్నీ జరిగింది.

Hockey World Cup 2023: పురుషుల హాకీ ప్రపంచ కప్ విజేత జర్మనీ.. ఫైనల్‌లో బెల్జియంపై గెలుపు

Hockey World Cup 2023: ఇండియాలో జరిగిన ‘పురుషుల హాకీ ప్రపంచ కప్-2023’ విజేతగా నిలిచింది జర్మనీ. ఆదివారం సాయంత్రం జరిగిన ఫైనల్‌లో బెల్జియం జట్టుపై పెనాల్టీ షూటౌట్‌లో జర్మనీ విజయం సాధించింది. ఫైనల్ ఉత్కంఠగా సాగి అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది.

Australia: ఖలిస్తాన్ మద్దతుదారుల అరాచకం.. ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడి

డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన బెల్జియం జట్టును జర్మనీ ఓడించింది. ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఈ టోర్నీ జరిగింది. మ్యాచ్ నిర్ణీత సమయం ముగిసే సరికి జర్మనీ-బెల్జియం 3-3తో సమానంగా నిలిచాయి. దీంతో నిర్వాహకులు పెనాల్టీ షూటౌట్ నిర్వహించారు. ఈ షూటౌట్‌లో కూడా ఇరు జట్లు చెరో గోల్ సాధించాయి. దీంతో స్కోరు 4-4తో సమానంగా నిలిచింది. ఈ దశలో టై బ్రేకర్ నిర్వహించారు. ఇందులో జర్మనీ విజయం సాధించింది. దీంతో బెల్జియంపై 5-4తో గెలుపొందింది. మ్యాచ్ ప్రారంభంలో జర్మనీ వెనుకబడింది. బెల్జియం 2-0తో ముందంజలో ఉంది. అయితే, తర్వాత జర్మనీ ఆటగాళ్లు చెలరేగారు. 9, 10 నిమిషాల్లో వరుస గోల్స్ చేశారు.

Hyderabad: పీర్జాదిగూడ పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 13 మంది అరెస్ట్

దీంతో స్కోరు 2-2కు చేరింది. తర్వాత 47వ నిమిషంలో జర్మనీ మరో గోల్ చేసింది. దీంతో స్కోరు 3-2 కు చేరింది. అప్పటికి దాదాపు జర్మనీ గెలిచే అవకాశాలే కనిపించాయి. కానీ, మ్యాచ్ ముగియడానికి రెండు నిమిషాల ముందు (58వ నిమిషంలో) బెల్జియం గోల్ చేసింది. దీంతో మ్యాచ్ ముగిసే సరికి స్కోరు 3-3గా మారింది. చివరకు పెనాల్టీ షూటౌట్‌లో జర్మనీ విజయం సాధించి పతకం కైవసం చేసుకుంది. ఈ టోర్నీకి ఆతిథ్యమిచ్చిన భారత జట్టు మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. నాకౌట్ దశలోనే వెనుదిరిగింది. క్వార్టర్ ఫైనల్స్ కూడా చేరలేకపోయింది. చివరకు ఈ ప్రపంచ కప్‌లో 9వ స్థానంతో సరిపెట్టుకుంది.