Rohit Sharma: టీ20లకు రోహిత్ గుడ్‌బై చెప్తున్నాడా.. రోహిత్ సమాధానం ఇదే!

హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో ఈ టోర్నీ సాగింది. ఇందులో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో తాజా పరిణామాల నేపథ్యంలో రోహిత్ శర్మ టీ20లకు పూర్తిగా గుడ్‌బై చెప్పనున్నాడనే ప్రచారం మొదలైంది. దీనిపై రోహిత్ స్పందించాడు.

Rohit Sharma: టీ20లకు రోహిత్ గుడ్‌బై చెప్తున్నాడా.. రోహిత్ సమాధానం ఇదే!

Rohit Sharma: టీమిండియా కెప్టెన్, స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ టీ20లకు గుడ్‌బై చెప్పబోతున్నాడా? ఈ ప్రశ్నకు రోహిత్ శర్మే నేరుగా సమాధానం ఇచ్చారు. కొంతకాలంగా టీ20ల్లో రోహిత్ శర్మ ఆటతీరు అంత గొప్పగా లేదు. అటు వ్యక్తిగతంగా ఆటగాడిగానూ, ఇటు కెప్టెన్‌గానూ అంచనాలు అందుకోవడంలో విఫలమవుతున్నాడు.

Vijaya Shanthi: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై విజయశాంతి ట్వీట్.. క్లారిటీ వచ్చేసినట్లేనా?

పైగా ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో గాయం కారణంగా రోహిత్ శర్మ పాల్గొనలేదు. హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో ఈ టోర్నీ సాగింది. ఇందులో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో తాజా పరిణామాల నేపథ్యంలో రోహిత్ శర్మ టీ20లకు పూర్తిగా గుడ్‌బై చెప్పనున్నాడనే ప్రచారం మొదలైంది. దీనిపై రోహిత్ స్పందించాడు. తాను ఇంకా అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదన్నాడు. ‘‘టీ20 ఫార్మాట్‌ను వదిలిపెట్టాలనే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’’ అని ప్రెస్ మీట్ సందర్భంగా రోహిత్ వ్యాఖ్యానించాడు. దీంతో ఈ అంశంపై జరుగుతున్న ప్రచారానికి తెర పడినట్లైంది. మంగళవారం నుంచి ఇండియా-శ్రీలంక మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

London: ఇదేం ట్రెడిషన్ బాబూ.. ప్యాంట్లు తొడుక్కోకుండా లండన్ వీధుల్లో తిరుగుతున్న జనం… కారణమేంటో తెలుసా?

దీనికి రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే రోహిత్ ప్రెస్‌మీట్ నిర్వహించాడు. దీనిలో భాగంగా తన టీమ్ ప్రణాళికల గురించి వివరించాడు. గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా టోర్నీకి దూరం కానున్నాడని వెల్లడించాడు. బుమ్రా నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇబ్బంది పడ్డాడని, అందువల్లే టోర్నీలో పాల్గొనడం లేదని తెలిపాడు. మంగళవారం గువహటిలో జరిగే తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ టీమిండియా ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడని వెల్లడించాడు. ఇషాన్ కిషన్‌ను తుదిజట్టులోకి తీసుకోలేకపోతున్నట్లు చెప్పాడు.