IND vs ENG: ఇంగ్లాండ్‌ను తట్టుకోవాలంటే వాళ్లు చెలరేగాల్సిందే

టెస్టుల్లో పిచ్‌లు కీలక పాత్ర పోషించి టీమిండియా ఆధిపత్యం సాధ్యపడిందేమో.. టీ20ల్లో మాత్రం అంత తేలిక కాదని ఇంగ్లాండ్‌తో సిరీస్‌ ఆరంభం నుంచి క్లియర్‌గా ఉంది. తొలి మ్యాచ్‌లోనే టీమిండియాకు షాక్ ఇచ్చిన ఇంగ్లాండ్ టీం..

IND vs ENG: ఇంగ్లాండ్‌ను తట్టుకోవాలంటే వాళ్లు చెలరేగాల్సిందే

India England

IND vs ENG:టెస్టుల్లో పిచ్‌లు కీలక పాత్ర పోషించి టీమిండియా ఆధిపత్యం సాధ్యపడిందేమో.. టీ20ల్లో మాత్రం అంత తేలిక కాదని ఇంగ్లాండ్‌తో సిరీస్‌ ఆరంభం నుంచి క్లియర్‌గా ఉంది. తొలి మ్యాచ్‌లోనే టీమిండియాకు షాక్ ఇచ్చిన ఇంగ్లాండ్ టీం.. మూడో టీ20లోనూ ఆధిపత్యం చెలాయించింది. నాలుగో మ్యాచ్‌లో ఆ జట్టు విజయానికి అత్యంత చేరువగా వెళ్లింది. విభాగాల వారీగా ఉత్తమంగా కనిపిస్తున్న ఇంగ్లాండ్‌ను ఓడించాలంటే భారత జట్టు మెరుగైన ప్రదర్శన చేయాల్సిందే.

కాగితం మీద ఎంతో బలంగా కనిపిస్తున్న భారత బ్యాటింగ్‌ విభాగం.. మైదానంలో నిలకడగా అందుకోకుంటే కష్టం. ప్రపంచంలోనే ఓపెనర్లుగా పేరున్న రోహిత్‌, రాహుల్‌ల నుంచి వారి స్థాయికి తగ్గ పర్‌ఫార్మెన్స్ ఆశిస్తోంది భారత్‌. రాహుల్‌ ఈసారైనా జట్టు నమ్మకాన్ని నిలబెడతాడేమో చూడాలి. రెండు, మూడు టీ20ల్లో చెలరేగిన కోహ్లి.. మ్యాచ్‌లో విఫలమయ్యాడు. కీలక పోరులో కెప్టెన్‌ నుంచి అభిమానులు పెద్ద ఇన్నింగ్స్‌ ఆశిస్తున్నారు.

మొదట బ్యాటింగ్‌ చేసే అవకాశం వస్తే.. ఎంత స్కోరు చేసినా కాపాడుకోవడం కష్టం కాబట్టి సూర్యకుమార్‌, పంత్‌, అయ్యర్‌, పాండ్య ఆకాశమే హద్దుగా చెలరేగాల్సిందే. బ్యాటింగ్‌ చేస్తే ఇంగ్లాండ్‌ ఫేసర్లను కాచుకోవడం భారత బ్యాట్స్‌మెన్‌కు సవాల్‌గా మారింది. టాస్‌ మ్యాచ్‌ ఫలితాన్ని నిర్దేశిస్తున్నప్పటికీ.. బ్యాట్స్‌మెన్‌ 200 స్కోరు చేసి ఇంగ్లాండ్‌కు సవాలు విసరాల్సి ఉంది.

ఇరు జట్లలోనూ భారీ హిట్టర్లు ఉండటంతో బౌలర్లకు ఇబ్బందులు తప్పనట్లు కనిపిస్తుంది. భారత్‌తో పోలిస్తే ఇంగ్లాండ్‌ బౌలింగ్‌ మెరుగ్గా ఉంది. టీమిండియాలో నిలకడగా రాణిస్తున్న బౌలర్లు కనిపించడం లేదు. ప్రధాన పేసర్‌ భువనేశ్వర్‌ అంచనాలకు అందుకోలేకపోతున్నాడు. శార్దూల్‌.. చివర్లో 2 వికెట్లు తీసి భారత్‌ను కాపాడినా అప్పటికే భారీగా పరుగులిచ్చేశాడు. ముందు రాణించిన స్పిన్నర్‌ సుందర్‌.. నాలుగో టీ20లో తేలిపోయాడు.

చాహల్‌ స్థానంలో వచ్చిన రాహుల్‌ చాహర్‌ గత మ్యాచ్‌లో రాణించాడు కానీ.. చివరి టీ20లో ప్రదర్శనను చూడాలి మరి. హార్దిక్‌ పాండ్యా నెమ్మదిగా బౌలింగ్‌లో ఊపందుకుంటుండటం సానుకూలాంశం. బట్లర్‌, రాయ్‌, మలన్‌, బెయిర్‌ స్టో, మోర్గాన్‌ ఏ ఇద్దరు క్రీజులో కుదురుకున్నా మ్యాచ్‌పై ఆశలు వదులుకోవాల్సిందే. వీరి తర్వాత వచ్చే స్టోక్స్‌, కరన్‌, ఆర్చర్‌ సైతం ప్రమాదకరంగానే ఉన్నారు. శనివారం ఈ భీకర బ్యాటింగ్‌ ఆర్డర్‌కు భారత బౌలర్లు ఏ రేంజ్‌లో అడ్డుకట్ట వేస్తారో చూడాలి.

టాస్‌ ఎవరిదో?
ఈ సిరీస్‌లోనూ టాస్‌ కీలక పాత్ర పోషిస్తోంది. గెలిచిన జట్టు మరో ఆలోచన లేకుండా ఛేదనను ఎంచుకుంటోంది. మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టుకు తడబాటు తప్పడం లేదు. తొలి 3 మ్యాచ్‌ల్లో టాస్‌ గెలిచిన జట్టే మ్యాచ్‌ గెలిచింది. గత మ్యాచ్‌లోనూ టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. మొదట తడబడ్డప్పటికీ, పుంజుకుని భారీ స్కోరు చేసింది. ఇంగ్లాండ్‌ లక్ష్యానికి చేరువగా వచ్చి త్రుటిలో ఓడింది. శనివారం కూడా టాస్‌ గెలిచిన జట్టు.. బౌలింగ్‌ ఎంచుకుంటే గెలవడానికి బాటలు పరుచుకున్నట్లే.