Womens U19 T20 World Cup : వరల్డ్ కప్ విజేత భారత్.. చరిత్ర సృష్టించిన అమ్మాయిలు

వరల్డ్ క్రికెట్ లో భారత అమ్మాయిలు అదరగొట్టారు. భారత్ ను ప్రపంచ విజేతగా నిలిపారు. సౌతాఫ్రికాలో జరిగిన తొలి అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ ను భారత్ కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లండ్ పై భారత్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

Womens U19 T20 World Cup : వరల్డ్ కప్ విజేత భారత్.. చరిత్ర సృష్టించిన అమ్మాయిలు

Womens U19 T20 World Cup : వరల్డ్ క్రికెట్ లో భారత అమ్మాయిలు అదరగొట్టారు. భారత్ ను ప్రపంచ విజేతగా నిలిపి చరిత్ర సృష్టించారు. సౌతాఫ్రికాలో జరిగిన తొలి ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ ను భారత్ కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లండ్ పై భారత్ 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.

తొలుత భారత బౌలర్లు చెలరేగారు. ఇంగ్లండ్ ను 17.1 ఓవర్లలో 68 పరుగులకే కుప్పకూల్చారు. అనంతరం 69 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 14 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

Also Read..T20 Cricket: టీ20 ఫార్మాట్‌లో అత్యధిక నో బాల్స్ వేసింది ఇండియా బౌలరేనట .. ఎన్ని నో ‌బాల్స్ వేశాడంటే..

కెప్టెన్ షెఫాలీ వర్మ (11 బంతుల్లో 15 పరుగులు), మరో ఓపెనర్ శ్వేతా సెహ్రావత్ (6 బంతుల్లో 5 పరుగులు) చేశారు. ఆ తర్వాత తెలుగమ్మాయి గొంగడి త్రిష 29 బంతుల్లో 24 పరుగులతో భారత్ విజయంలో కీలకపాత్ర పోషించింది. సౌమ్యా తివారి 37 బంతుల్లో 24 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ ను గెలుపుతీరాలకు చేర్చింది. మహిళల అండర్-19 విభాగంలో తొలిసారి నిర్వహించిన ఈ టీ20 వరల్డ్ కప్ ను భారత్ గెలుచుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

తుది పోరులో టాస్ నెగ్గిన భారత్.. బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ నమ్మకాన్ని భారత బౌలర్లు వమ్ము చేయలేదు. పిచ్ ను సద్వినియోగం చేసుకుని చెలరేగిపోయారు. బంతితో నిప్పులు చెరిగారు. ఇంగ్లండ్ బ్యాటర్లను కంగారెత్తించారు. ఇంగ్లండ్ ను 68 పరుగులకే కుప్పకూల్చారు.

Also Read..MS Dhoni: నిన్న‌టి మ్యాచులో ‘ధోనీ.. ధోనీ’ అంటూ అభిమానుల నినాదాలు.. వీడియో

భారత బౌలర్లలో తితాస్ సాధు, అర్చనా దేవి, పర్శవి చోప్రా తలో రెండు వికెట్లు తీశారు. మన్నత్ కశ్యప్, కెప్టెన్ షెఫాలీ వర్మ, సోనమ్ యాదవ్ చెరో వికెట్ తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. ఇంగ్లండ్ జట్టులో రయానా మెక్ డొనాల్డ్ 19 పరుగులతో హయ్యస్ట్ స్కోరర్ గా నిలిచింది. నిమా హోలాండ్ 10, అలెక్సా స్టోన్ హౌస్ 11, సోఫియా స్మేల్ 11 పరుగులు చేశారు.

అండర్ 19 వరల్డ్ కప్ లో యువ భారత్ చరిత్ర సృష్టించింది. వరల్డ్ కప్ గెలవడం ద్వారా మహిళల క్రికెట్ లో సువర్ణ అధ్యాయం లిఖించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.