T20 Cricket: టీ20 ఫార్మాట్‌లో అత్యధిక నో బాల్స్ వేసింది ఇండియా బౌలరేనట .. ఎన్ని నో ‌బాల్స్ వేశాడంటే..

టీ20 ఫార్మాట్‌లో నో బాల్స్ వేయడం అంటే అరుదుగా కనిపిస్తుంది. నో బాల్ పడిందా అదనపు పరుగుతోపాటు సిక్సర్ ఇచ్చినట్లే. దీంతో బ్యాటింగ్ చేసే జట్టు స్కోర్ బోర్డ్ అమాంతం పెరిగిపోతుంది. బౌలర్స్ సాధ్యమైనంత వరకు నోబాల్స్ వేయకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తారు. కానీ ఒక్కోసారి నో బాల్స్ పడుతూనే ఉంటాయి. టీ20 ఫార్మాట్‌లో ఇలా నో బాల్స్ అత్యధికంగా వేసిన ఆటగాడు ఎవరంటే ఇండియా బౌలర్ పేరు అగ్రస్థానంలో ఉంది.

T20 Cricket: టీ20 ఫార్మాట్‌లో అత్యధిక నో బాల్స్ వేసింది ఇండియా బౌలరేనట .. ఎన్ని నో ‌బాల్స్ వేశాడంటే..

Team india

T20 Cricket : టీ20 ఫార్మాట్‌లో నో బాల్స్ వేయడం అంటే అరుదుగా కనిపిస్తుంది. నో బాల్ పడిందా అదనపు పరుగుతోపాటు సిక్సర్ ఇచ్చినట్లే. దీంతో బ్యాటింగ్ చేసే జట్టు స్కోర్ బోర్డ్ అమాంతం పెరిగిపోతుంది. బౌలర్స్ సాధ్యమైనంత వరకు నోబాల్స్ వేయకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తారు. కానీ ఒక్కోసారి నో బాల్స్ పడుతూనే ఉంటాయి. టీ20 ఫార్మాట్‌లో ఇలా నో బాల్స్ అత్యధికంగా వేసిన ఆటగాడు ఎవరంటే ఇండియా బౌలర్ పేరు అగ్రస్థానంలో ఉంది. టీమిండియా యంగ్ బౌలర్ అర్షదీప్ సింగ్ ఈ చెత్త ఘనతను సాధించాడు. ఇప్పటి వరకు అతను 24 ఇన్నింగ్స్‌లు ఆడి 14 నో బాల్స్ వేసి రికార్డుల్లోకెక్కాడు. న్యూజిలాండ్‌తో శుక్రవారం రాత్రి జరిగిన ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో నో బాల్ వేయడం ద్వారా అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో అత్యధిక నో బాల్స్ వేసిన బౌలర్‌గా అర్షదీప్ సింగ్ రికార్డుల్లోకికెక్కాడు.

India vs New Zealand: తొలి టీ20లో ముగిసిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్.. భారత టార్గెట్ 177

అర్ష్‌దీప్ తరువాతి స్థానంలో పాకిస్థాన్ బౌలర్ హసన్ అలీ ఉన్నారు. అతను తొమ్మిది ఇన్నింగ్స్‌లో 11 నోబాల్స్ వేశాడు. ఆరు ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ బౌలర్ కీమో పాల్ కూడా 11 నో బాల్స్ వేశాడు. ఆ తరువాత స్థానంలో ఒషానే థామస్ 11 నో బాల్స్ వేయగా, రిచర్డ్ నగరావా 10 నో బాల్స్ వేశాడు. న్యూజిలాండ్ జట్టుతో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో భారత్ జట్టు 21 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అర్షదీప్ వేసిన లాస్ట్ ఓవర్‌లో న్యూజిలాండ్ జట్టు ఏకంగా 27 పరుగులు రాబట్టింది. 19 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్ 149 మాత్రమే ఉంది. చివరి ఓవర్లో అర్షదీప్ నోబాల్ వేయడంతో తొలి రెండు బంతుల్లోనే 19 పరుగులు ఇచ్చాడు. దీంతో ఆ ఓవర్లో కివీస్ 27 పరుగులు రాబట్టడంతో 176 పరుగులు చేయగలిగింది. ఒకవేళ అర్హదీప్ చివరి ఓవర్ లో భారీ పరుగుల ప్రవావానికి కట్టడి వేసిఉంటే టీమిండియా విజయం సాధించే అవకాశాలు ఉండేవి.

#IND vs NZ: ఆట‌లో ఇలాంటి ఓట‌మి స‌హ‌జ‌మే: వాషింగ్ట‌న్ సుంద‌ర్

ఇదిలాఉంటే అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో నో బాల్ వేయని బౌలర్లు కూడా ఉన్నారు. వారిలో భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ 131 టెస్టులు, 225 వన్డేలు ఆడి ఒక్క నో బాల్ కూడా వేయలేదు. 79 టెస్టులు, మూడు వన్డేలు ఆడిన వెస్టిండీస్ స్పిన్నర్ లాన్సే గిబ్స్ కూడా తన కెరీర్ లో ఒక్క నో బాల్ కూడా వేయలుద. ఇంగ్లండ్ మాజీ ఆల్ రౌండర్ ఇయాన్ బోథాం, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ డెన్నిస్ లిల్లీ, పాకిస్థాన్ మాజీ పాస్ట్ బౌలర్ ఇమ్రాన్ ఖాన్ కూడా నో బాల్ వేయలేదు.