IND vs PAK : ఈరోజు మ్యాచ్‌ సాధ్యం కాకపోతే ఏమి జరుగుతుందంటే..?

ఆసియాక‌ప్‌ (Asia Cup) 2023లో భార‌త్‌, పాకిస్తాన్ మ్యాచ్‌ను ఎంజాయ్ చేద్దామనుకున్న స‌గ‌టు క్రికెట్ అభిమానుల‌కు నిరాశ త‌ప్ప‌డం లేదు.

IND vs PAK : ఈరోజు మ్యాచ్‌ సాధ్యం కాకపోతే ఏమి జరుగుతుందంటే..?

IND vs PAK

India vs Pakistan : ఆసియాక‌ప్‌ (Asia Cup) 2023లో భార‌త్‌, పాకిస్తాన్ మ్యాచ్‌ను ఎంజాయ్ చేద్దామనుకున్న స‌గ‌టు క్రికెట్ అభిమానుల‌కు నిరాశ త‌ప్ప‌డం లేదు. వ‌రుణుడి కార‌ణంగా లీగ్ ద‌శ‌లో ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గాల్సిన మ్యాచ్ ర‌ద్దు అయిన సంగ‌తి తెలిసిందే. సూప‌ర్ 4లో భాగంగా ప్రేమ‌దాస స్టేడియంలో నేడు(ఆదివారం సెప్టెంబ‌ర్ 10) భార‌త్‌, పాకిస్తాన్‌లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భార‌త్ తొలుత బ్యాటింగ్ చేస్తోంది.

ICC ODI rankings : పాక్‌ను వెన‌క్కు నెట్టి.. మ‌ళ్లీ వ‌న్డేల్లో అగ్ర‌స్థానానికి చేరిన ఆసీస్‌.. టీమ్ఇండియా ఎక్క‌డంటే..?

అయితే.. భార‌త ఇన్నింగ్స్‌లో 24.1 ఓవ‌ర్లు పూర్తి అయిన స‌మ‌యంలో మ్యాచ్‌కు వ‌రుణుడు అంత‌రాయం క‌లిగించాడు. చిన్న చినుకులుగా మొద‌లైన వాన‌ క్ష‌ణాల్లోనే భారీ వ‌ర్షంగా మారింది. మైదాన సిబ్బంది వెంట‌నే గ్రౌండ్ మొత్తాన్ని క‌వ‌ర్ల‌తో క‌ప్పేశారు. దీంతో అభిమానుల్లో టెన్ష‌న్ మొద‌లైంది. మ్యాచ్ ఈ రోజు జ‌రుగుతుందా..? లేదా ర‌ద్దు అయితే పరిస్థితి ఏంటి అనే ప్ర‌శ్న‌లు అభిమానుల మ‌దిలో మెదులుతున్నాయి.

Ind Vs Pak: కడుపుబ్బా నవ్విస్తున్న మీమ్స్.. రోహిత్, గిల్ విధ్వంసం వల్లే.. మధ్యలో సచిన్ కూతురు ఏం చేసింది?

ఒక‌వేళ వ‌ర్షం కార‌ణంగా ఈ రోజు మ్యాచ్ జ‌ర‌గ‌పోతే రిజ‌ర్వే డే రోజు అంటే సోమ‌వారం(సెప్టెంబ‌ర్ 11)న మ్యాచ్‌ను నిర్వ‌హిస్తారు. ఈ రోజు మ్యాచ్ ఎక్క‌డైతే ఆగిపోయిందో అక్క‌డి నుంచే మ్యాచ్ మొద‌లుకానుంది. అయితే.. సాధ్య‌మైనంత మేర‌కు ఈ రోజే మ్యాచ్‌ను ముగించేలా అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటారు.

ఈ రోజు మ్యాచ్‌ను ముగించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలు ఇవే..

– ఓవ‌ర్ల సంఖ్య‌ను కుదించ వ‌చ్చు.
– 20 ఓవ‌ర్ల మ్యాచ్‌ను నిర్వ‌హించ‌వ‌చ్చు. ఇప్ప‌టికే భార‌త్ ఇన్నింగ్స్‌లో 20 ఓవ‌ర్లు పూర్తి అయిన నేప‌థ్యంలో పాకిస్తాన్ చేజింగ్ చేయాల్సి వ‌స్తే 20 ఓవర్లలో ఆ జట్టు 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి వ‌స్తోంది.
– మ్యాచ్ స‌మ‌యాన్ని మ‌రో 90 నిమిషాలు పొడిగించ‌వ‌చ్చు.

పైన పేర్కొన్న ఏమీ ఈ రోజు సాధ్యం కాక‌పోతే మ‌రుస‌టి రోజుకు మ్యాచ్‌ను వాయిదా వేస్తారు. సోమ‌వారం కూడా మ్యాచ్ నిర్వ‌హ‌ణ‌కు వీలులేక‌పోతే అప్పుడు మ్యాచ్‌ను ర‌ద్దు చేస్తారు.

ప్ర‌స్తుతం భార‌త్ 24.1వ ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 147/2. కేఎల్ రాహుల్ (17), విరాట్ కోహ్లి (8) లు క్రీజులో ఉన్నారు. రోహిత్ శ‌ర్మ (56; 49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స‌ర్లు), శుభ్ మ‌న్ గిల్ (58; 52 బంతుల్లో 10 ఫోర్లు) లు అర్థ‌శ‌త‌కాలు బాది ఔటైయ్యారు.

David Warner సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేసిన డేవిడ్ వార్నర్.. అదెంటో తెలుసా?