Jasprit Bumrah : చూసుకుందాం.. సౌతాఫ్రికా ప్లేయర్లకు బుమ్రా వార్నింగ్

సౌతాఫ్రికా ప్లేయర్లకు భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. చూసుకుందాం.. మేమేంటో చూపిస్తాం అని వారితో అన్నాడు.

Jasprit Bumrah : చూసుకుందాం.. సౌతాఫ్రికా ప్లేయర్లకు బుమ్రా వార్నింగ్

Jasprit Bumrah

Jasprit Bumrah : సౌతాఫ్రికా ప్లేయర్లకు భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. చూసుకుందాం.. మేమేంటో చూపిస్తాం అని వారితో అన్నాడు. అసలేం జరిగిందంటే.. జోహన్నెస్ బర్గ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో కేఎల్ రాహుల్, బుమ్రాలను సఫారీలు స్లెడ్జింగ్ చేశారు. శార్ధూల్ ఠాగూర్ ను కూడా హేళన చేస్తూ విసిగించారు. ఆ సమయంలో బుమ్రా చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. ”ఇంకో మ్యాచ్ ఉంది చూసుకుందాం.. తర్వాత మ్యాచ్ లో మేమేంటో చూపిస్తాం” అంటూ బుమ్రా అన్నాడు.

MS Dhoni: పాకిస్తాన్ ఫేసర్‌కు స్పెషల్ గిఫ్ట్ పంపిన ఎంఎస్ ధోనీ

మూడు టెస్టుల సిరీస్ లో భారత్, సౌతాఫ్రికా చెరో మ్యాచ్ గెలిచాయి. దీంతో జనవరి 11న కేప్ టౌన్ లో జరిగే ఆఖరి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. ఇరు జట్లూ గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నాయి. మూడో మ్యాచ్ లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నాయి.

రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ పై దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో సిరీస్‌ను 1-1తో సమం చేసింది. కెప్టెన్ ఎల్గార్ 96 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టుని ఒంటి చేత్తో గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 202, సౌతాఫ్రికా 229 చొప్పున పరుగులు చేశాయి. ఆ తర్వాత భారత్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో 266 పరుగులు చేసింది. 240 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని సునాయంగా ఛేదించింది.

Mithali Raj: మిథాలీ రాజ్ కెప్టెన్సీలో వరల్డ్ కప్ 2022

కాగా, మూడు టెస్ట్ మ్యాచ్‌లో సిరీస్‌లో సెంచూరియన్ పార్కులో జరిగిన తొలి టెస్టులో భారత్ విజయం సాధించగా, రెండో టెస్టులో దక్షిణాఫ్రికా గెలుపొందింది. ఈ నెల 11 నుంచి కీలకమైన మూడో టెస్ట్ మ్యాచ్ కేప్‌టౌన్ వేదికగా ప్రారంభం కానుంది.