Ind Vs WI : విండీస్‌పై భారత్ హ్యాట్రిక్ విజయం.. వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్

భారత జట్టు అదరగొట్టింది. వెస్టిండీస్ తో మూడో వన్డేలోనూ ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్ ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది.

Ind Vs WI : విండీస్‌పై భారత్ హ్యాట్రిక్ విజయం.. వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్

Ind Vs Wi India Beat Windies

Ind Vs WI : భారత జట్టు అదరగొట్టింది. వెస్టిండీస్ తో మూడో వన్డేలోనూ ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా 3-0 తేడాతో కైవసం చేసుకుంది.

అహ్మదాబాద్ వేదికగా జరిగిన చివరి వన్డేలో 96 పరుగుల భారీ తేడాతో భారత్ గెలుపొందింది. 266 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన విండీస్‌ 169 పరుగులకే ఆలౌట్ అయ్యింది. విండీస్‌ బ్యాటర్లలో ఓడీన్‌ స్మిత్‌ (36) టాప్‌ స్కోరర్‌. భారత బౌలర్లలో మహమ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ చెరో మూడు వికెట్లు తీశారు. దీపక్‌ చాహర్‌, కుల్దీప్‌ యాదవ్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

IPL auction 2022: వేలంలో అండర్-19 ప్రపంచ కప్‌ విజేతలు..

ఛేదనకు దిగిన విండీస్‌కు ఆరంభంలోనే భారత బౌలర్లు వరుస షాకులు ఇచ్చారు. విండీస్‌ 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్‌ పూరన్‌ (34), డారెన్‌ బ్రావో (20)లు ఇన్నింగ్స్‌ని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. కానీ లాభం లేకపోయింది. ఆల్‌ రౌండర్‌ జేసన్‌ హోల్డర్‌ (6), ఫేబియన్‌ అలెన్ (0) విఫలం అయ్యారు. ఆఖర్లో వచ్చిన ఓడీన్‌ స్మిత్‌ (36) కాసేపు ధాటిగా ఆడి వెనుదిరిగాడు. అల్జారీ జోసెఫ్ (29), హేడెన్‌ వాల్ష్‌ (13) వికెట్ కాపాడుకుంటూ నెమ్మదిగా ఆడారు. వీరిద్దరూ కలిసి తొమ్మిదో వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ జోడీని మహమ్మద్ సిరాజ్‌ విడగొట్టాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే విండీస్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే భారత్‌ కీలక వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ 13 పరుగులు చేయగా, శిఖర్ ధావన్ 10 పరుగులు చేశాడు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. 42 పరుగులకే 3 వికెట్లు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్ ను.. అయ్యర్, పంత్ జోడీ ఆదుకుంది.

IPL auction 2022: వేలంలో “ఆ నలుగురు” కోసం భారీ డిమాండ్!

శ్రేయస్‌ అయ్యర్‌ (80), యువ వికెట్ కీపర్ రిషభ్‌ పంత్ (56) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ ఇద్దరూ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దారు. నాలుగో వికెట్‌కి 110 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత హేడెన్‌ వాల్ష్‌ బౌలింగ్‌లో పంత్ కీపర్‌కి చిక్కాడు. ధాటిగా ఆడే క్రమంలో శ్రేయస్‌ అయ్యర్‌ బ్రావోకి చిక్కాడు.

ఆఖర్లో వచ్చిన దీపక్‌ చాహర్‌ (38), వాషింగ్టన్‌ సుందర్‌ (33) ధాటిగా ఆడుతూ పరుగులు రాబట్టారు. సూర్యకుమార్‌ యాదవ్‌ (6), కుల్దీప్‌ యాదవ్‌ (5), మహమ్మద్‌ సిరాజ్‌ (4) స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. విండీస్‌ బౌలర్లలో జేసన్‌ హోల్డర్ నాలుగు వికెట్లు తీశాడు. అల్జారీ జోసెఫ్‌, హేడెన్‌ వాల్ష్‌ తలో రెండు వికెట్లు తీశారు. ఓడీన్‌ స్మిత్‌, ఫేబియన్‌ అలెన్‌ తలో వికెట్ పడగొట్టారు.

స్కోర్లు..
భారత్ – 265 ఆలౌట్(50 ఓవర్లు)
వెస్టిండీస్ – 169 ఆలౌట్(37.1ఓవర్లు)