India vs South Africa T20 Match: ఆ మూడు జట్లపై టీమిండియా గెలవాలని పాకిస్థాన్ ప్రార్థనలు .. ఎందుకో తెలుసా?

భారత్ జట్టు పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడుతున్నప్పుడే కాదు.. ఏ జట్టుపై ఆడుతున్నా ఓడిపోవాలని కోరుకునే దేశాల్లో పాకిస్థాన్ ఒకటిగా ఉంటుంది. ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా తదుపరి ఆడే మూడు జట్లపై ఎట్టిపరిస్థితుల్లో విజయం సాధించాలని పాక్ లోని క్రికెట్ అభిమానులు ప్రార్థనలుసైతం చేస్తున్నారు.

India vs South Africa T20 Match: ఆ మూడు జట్లపై టీమిండియా గెలవాలని పాకిస్థాన్ ప్రార్థనలు .. ఎందుకో తెలుసా?

India vs pakistan

India vs South Africa T20 Match: భారత్ జట్టు పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడుతున్నప్పుడే కాదు.. ఏ జట్టుపై ఆడుతున్నా ఓడిపోవాలని కోరుకునే దేశాల్లో పాకిస్థాన్ ఒకటిగా ఉంటుంది. ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లలో టీమిండియా ఆడే మూడు మ్యాచ్‌లలో భారత్ గెలవాలని పాకిస్థాన్ క్రికెట్ ప్లేయర్స్‌తో పాటు ఆ దేశంలోని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. ఆ మూడు జట్లపై ఎట్టిపరిస్థితుల్లో టీమిండియా ఓడిపోవద్దంటూ ప్రార్థనలుసైతం చేస్తున్నారు.

India vs Pakistan T20 Match: పాక్‌పై విజయంతో రికార్డుల మోతమోగించిన టీమిండియా.. అవేమిటో తెలుసా!

ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్ -2022 జరుగుతుంది. భారత్, పాకిస్థాన్ జట్లు గ్రూప్-2లో ఉన్నాయి. గ్రూప్ -2లో మొత్తం ఆరు జట్లు ఆడుతున్నాయి. అన్ని జట్లు రెండేసి మ్యాచ్ లు ఆడాయి. పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్లపై విజయాలు సాధించి టీమిండియా గ్రూప్-2 పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది. దాయాది జట్టు పాకిస్థాన్ భారత్, జింబాబ్వే జట్ల తో తలపడి ఓడిపోయి పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం భారత్ జట్టు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, బంగ్లాదేశ్ జట్లపై ఆడాల్సి ఉంది. నేడు దక్షిణాఫ్రికా జట్టుతో టీమిండియా తలపడుతుంది. అయితే ఈ మ్యాచ్ లో భారత్ జట్టు గెలవాలని పాక్ లోని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.

India vs Pakistan T20 Match: పాక్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ తరువాత రాహుల్ ద్రవిడ్ రియాక్షన్ చూశారా.. వీడియో వైరల్

పాకిస్థాన్ జట్టు వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడిపోయి సెమిస్ ఆశలను క్లిష్టతరం చేసుకుంది. పాక్ సెమీ ఫైనల్ లో అడుగుపెట్టాలంటే ఆ జట్టు తరువాత ఆడే మూడు మ్యాచ్‌లలో భారీ విజయాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు.. టీమిండియా ఆడే మూడు (దక్షిణాఫ్రికా, జింబాబ్వే, బంగ్లాదేశ్) మ్యాచ్ లలో గెలవాల్సి ఉంటుంది. అలా జరిగితే పాకిస్థాన్ జట్టు సెమి ఫైనల్ కు చేరే అవకాశాలు ఉంటాయి. దీంతో ఎప్పుడూలేని విధంగా పాకిస్థాన్ లోని క్రీడాభిమానులు తదుపరి మూడు మ్యాచ్ లలో టీమిండియా విజయం సాధించాలని కోరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

T20 World Cup: వరల్డ్ కప్‌లో మరో సంచలనం.. ఒక్క పరుగు తేడాతో పాకిస్తాన్‌పై జింబాబ్వే విజయం

గ్రూప్-2లో జట్లు ఆడాల్సిన మ్యాచ్‌లు ఇవే..

అక్టోబర్ 30 ఆదివారం: బంగ్లాదేశ్ v జింబాబ్వే, ది గబ్బా, బ్రిస్బేన్

అక్టోబర్ 30 ఆదివారం: నెదర్లాండ్స్ v పాకిస్తాన్, పెర్త్ స్టేడియం

అక్టోబర్ 30 ఆదివారం: భారత్ v సౌతాఫ్రికా, పెర్త్ స్టేడియం

బుధవారం 02 నవంబర్: జింబాబ్వే v నెదర్లాండ్స్, అడిలైడ్ ఓవల్

బుధవారం 02 నవంబర్: భారత్ v బంగ్లాదేశ్, అడిలైడ్ ఓవల్

నవంబర్ 03 గురువారం: పాకిస్తాన్ v దక్షిణాఫ్రికా, SCG, సిడ్నీ

నవంబర్ 06 ఆదివారం: దక్షిణాఫ్రికా v నెదర్లాండ్స్, అడిలైడ్ ఓవల్

నవంబర్ 06 ఆదివారం: పాకిస్థాన్ v బంగ్లాదేశ్, అడిలైడ్ ఓవల్

ఆదివారం 06 నవంబర్: జింబాబ్వే v ఇండియా, MCG, మెల్‌బోర్న్