Tokyo Olympics 2020 : భారత్‌ ర్యాంక్‌ 47.. టాప్‌లో ఎవరంటే?

లై 23 తేదీన ప్రారంభమైన టోక్యో ఒలింపిక్స్, నేటి(ఆగస్టు 8)తో ముగియనున్నాయి. దాదాపు అన్ని క్రీడాంశాల్లో పోటీలు పూర్తవ్వగా మిగిలినవి ఈ రోజు సాయంత్రం వరకు పూర్తవుతాయి. ఇక ఈ ఒలింపిక్స్ లో ఎప్పటిలాగే అమెరికా మొదటి స్థానంలో నిలిచింది.. ఆ తర్వాత చైనా, మూడవ స్థానంలో ఆతిధ్య దేశం జపాన్ నిలిచింది.

Tokyo Olympics 2020 : భారత్‌ ర్యాంక్‌ 47.. టాప్‌లో ఎవరంటే?

Tokyo Olympics 2020

Tokyo Olympics 2020 : జులై 23 తేదీన ప్రారంభమైన టోక్యో ఒలింపిక్స్, నేటి(ఆగస్టు 8)తో ముగియనున్నాయి. దాదాపు అన్ని క్రీడాంశాల్లో పోటీలు పూర్తవ్వగా మిగిలినవి ఈ రోజు సాయంత్రం వరకు పూర్తవుతాయి. ఇక ఈ ఒలింపిక్స్ లో ఎప్పటిలాగే అమెరికా మొదటి స్థానంలో నిలిచింది.. ఆ తర్వాత చైనా, మూడవ స్థానంలో ఆతిధ్య దేశం జపాన్ నిలిచింది. పతకాల పట్టికలో భారత్ 47 స్థానంలో నిలిచింది.

భారత ఆటగాళ్లు మొత్తం 7 పతకాలు సాధించారు. వాటిలో ఒకటి బంగారు పతకం కాగా మరో రెండు రజతం, నాలుగు కాంస్య పతకాలు ఉన్నాయి.. టాప్ ట్రీ దేశాల పతకాల పట్టకను ఓ సారి పరిశీలిస్తే.. అమెరికా మొత్తం 108 పతకాలు సాధించింది. వాటిలో (36 స్వర్ణం, 39 రజతం, 33 కాంస్యం) చైనా 87 పతకాలు సాధించింది వాటిలో ( 38 స్వర్ణం, 31 రజతం, 18 కాంస్యం) ఉన్నాయి. జపాన్ 56 పతకాలు (27 స్వర్ణం, 12 రజతం, 17 కాంస్యం) సాధించి మూడవ స్థానంలో నిలిచింది.

రష్యా 70 పతకాలు సాధించి నాలుగవ స్థానంలో నిలించింది (20 స్వర్ణం, 27 రజతం, 23 కాంస్యం) ఆ తర్వాతి స్థానంలో బ్రిటన్ నిలిచింది. సిరియన్ అరబ్ రిపబ్లిక్ ఒక పతకం గెలిచి చివరి స్థానంలో నిలిచింది.