Virender Sehwag : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆట‌గాళ్ల జెర్సీలపై.. ఇండియా అని కాకుండా..

ఇండియా పేరును కేంద్ర ప్రభుత్వం భారత్‌గా మార్చబోతుందని దేశ వ్యాప్తంగా ప్రచారం జరుగుతోన్న వేళ బీసీసీఐ కార్య‌ద‌ర్శి జైషా (Jay Shah) కి మాజీ క్రికెట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) ఓ విజ్ఞప్తి చేశారు

Virender Sehwag : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆట‌గాళ్ల జెర్సీలపై.. ఇండియా అని కాకుండా..

India players should have Bharat written on chest says Virender Sehwag

Sehwag-Bharat : ఇండియా పేరును కేంద్ర ప్రభుత్వం భారత్‌గా మార్చబోతుందని దేశ వ్యాప్తంగా ప్రచారం జరుగుతోన్న వేళ బీసీసీఐ కార్య‌ద‌ర్శి జైషా (Jay Shah) కి మాజీ క్రికెట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) ఓ విజ్ఞప్తి చేశారు. ఇండియాకు బ‌దులు భార‌త్ పేరుతో ఉన్న జెర్సీల‌ను ఆట‌గాళ్లు ధ‌రించాల‌ని కోరాడు. స్వ‌దేశంలో అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త ఆట‌గాళ్లు భార‌త్ (Bharat) అని రాసి ఉన్న జెర్సీల‌లో బ‌రిలోకి దిగేలా చూడాల‌ని జైషాని సెహ్వాగ్ కోరాడు.

వీరేంద్ర సెహ్వాగ్ ఇప్ప‌టికే త‌న ఎక్స్ (ట్విట‌ర్‌) బ‌యోలో భార‌తీయుడిగా గ‌ర్విస్తున్నా అని మార్చుకున్నాడు. ఇంత‌క‌ముందు వ‌ర‌కు ఇండియ‌న్‌గా గ‌ర్విస్తున్నా అని ఉండేది.

నెదర్లాండ్స్ , మయన్మార్‌లను భారత్ స్ఫూర్తిగా తీసుకుని మెగా ఈవెంట్ కోసం తమ జెర్సీలపై పేరు మార్చుకోవాలని సెహ్వాగ్ కోరారు. ఈ మేర‌కు వ‌రుస ట్వీట్లు చేశాడు. ‘1996 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో నెద‌ర్లాండ్ జట్టు హాలండ్ పేరుతో ఆడింది. 2003లో మేం ఆ జ‌ట్టుతో ఆడిన‌ప్పుడు నెద‌ర్లాండ్స్ పేరుతోనే బ‌రిలోకి దిగారు. బ్రిటిష్ వారు పెట్టిన‌ పేరును బ‌ర్మా మ‌ళ్లీ మ‌య‌న్మార్‌గా మార్చుకుంది. చాలా దేశాలు మ‌ళ్లీ అస‌లు పేరుకు మారాయి.’ అని ఓ ట్వీట్‌లో సెహ్వాగ్ తెలిపాడు.

ODI World Cup : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌కు ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు ఇదే.. ఐపీఎల్ హీరోల‌కు ద‌క్కని చోటు

మ‌రో ట్వీట్‌లో ఒక పేరు.. మనలో గర్వాన్ని నింపేదిగా ఉండాలని తాను ఎప్పుడూ నమ్ముతానని అన్నాడు. “మ‌నం భారతీయులం. భారతదేశం అనేది బ్రిటిష్ వారు పెట్టిన పేరు. మన అసలు పేరు ‘భారత్’ అధికారికంగా తిరిగి రావడానికి చాలా కాలం గడిచిపోయిందన్నాడు. అక్టోబ‌ర్‌లో జ‌ర‌గ‌నున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ లో మ‌న ఆట‌గాళ్లు ఇండియాకు బ‌దులు భార‌త్ అని ఉన్న జెర్సీల‌ను ధ‌రించేలా చూడాల‌ని బీసీసీఐ కార్య‌ద‌ర్శి జైషా ను కోరుతున్నా.” అని సెహ్వాగ్ తెలిపారు.

ఇదిలా ఉంటే.. మంగ‌ళ‌వారం వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ కోసం భార‌త జ‌ట్టును బీసీసీఐ ప్ర‌క‌టించింది. తిల‌క్ వ‌ర్మ‌, సంజు శాంస‌న్‌, ప్ర‌సిద్ధ్ కృష్ణ మిన‌హా ఆసియా క‌ప్‌కు ఎంపిక చేసిన జ‌ట్టునే ప్ర‌పంచ‌క‌ప్‌కు ప్ర‌క‌టించారు.

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌కు భార‌త జ‌ట్టు ఇదే..

రోహిత్ శర్మ్(కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య(వైస్ కెప్టెన్‌), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.

Virat Kohli : అరుదైన ఘ‌న‌త‌ను అందుకున్న కోహ్లి..