IND vs PAK: మళ్లీ భారత్‌దే విజయమా? పాకిస్తాన్ చరిత్ర తిరగరాస్తుందా? మ్యాచ్ ప్రిడిక్షన్.. పిచ్, పూర్తి జట్టు వివారాలు!!

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో T20 వరల్డ్ కప్(T20 World Cup 2021) హై వోల్టేజ్ మ్యాచ్‌ ఇవాళ(24 అక్టోబర్ 2021) దాయాది జట్లు భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి.

10TV Telugu News

Bigg Day.. T20 World Cup 2021, IND vs PAK: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో T20 వరల్డ్ కప్(T20 World Cup 2021) హై వోల్టేజ్ మ్యాచ్‌ ఇవాళ(24 అక్టోబర్ 2021) దాయాది జట్లు భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. రెండు జట్లలోనూ ప్రపంచస్థాయి ఆటగాళ్లు ఉన్నారు. ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా ఉంటుందని భావిస్తున్నారు ప్రేక్షకులు.

ఐసీసీ టీ20 ఇంటర్నేషనల్ ర్యాంకుల్లో భారత్ రెండో స్థానంలో ఉండగా.. పాకిస్తాన్ మూడో ర్యాంకులో ఉంది. మొదటి స్థానం ఇంగ్లండ్‌ది. బంతి, బంతిని ఉత్కంఠగా వీక్షించే ప్రేక్షకులకు ఈ మ్యాచ్ మరింత హైఓల్టేజ్ మ్యాచ్‌గా మారనుంది.

భారత జట్టులోని బ్యాట్స్‌మెన్, బౌలర్లు ఇద్దరూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ భారత్‌కు బలమైన ఓపెనర్లు. కెప్టెన్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా మిడిల్ ఆర్డర్‌లో బలంగా ఉన్నారు. ఫాస్ట్ బౌలింగ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్‌ల త్రయం మరోసారి పాకిస్తాన్‌ని ముప్పుతిప్పలు పెట్టొచ్చని భావిస్తున్నారు. స్పిన్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా జట్టును బలోపేతం చేయవచ్చు.

పాకిస్తాన్ జట్టు బలం విషయానికి వస్తే..
పాకిస్తాన్ జట్టులో కెప్టెన్ బాబర్ అజమ్, మొహమ్మద్ రిజ్వాన్ ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు. బాబర్ ఈ ఏడాది 134.7 స్ట్రైక్ రేట్‌తో 1363 పరుగులు చేశాడు. మహ్మద్ రిజ్వాన్ 133.4 స్ట్రైక్ రేట్‌తో 1462 పరుగులు చేశారు. వీరిద్దరిపై పాకిస్తాన్ భారీ అంచనాలు పెట్టుకుంది.

ఐసీసీ టీ20 వరల్డ్​ కప్​ చరిత్రలో టీమ్ఇండియాను పాకిస్తాన్​ ఓడించలేదు. కానీ, ఆ రికార్డును ఆదివారం జరిగే మ్యాచ్​తో తిరగరాస్తామని పాక్​ కెప్టెన్​ బాబర్​ అజామ్ ధీమా వ్యక్తం చేశాడు.

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం చేజింగ్‌ టీమ్ విజయాలు సాధించే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో టాస్ కీలకం కానుంది. టాస్ ఎవరు గెలిచినా బౌలింగ్ తీసుకుంటారు. అయితే, టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తారనేది చూడాలి.

పిచ్ రిపోర్ట్:
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. బ్యాట్స్‌మెన్‌కు సహకరించే ఈ పిచ్‌పై సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫాస్ట్ బౌలర్లు రాణించడం కష్టం అవుతుంది. స్పిన్నర్లు మిడిల్ ఓవర్లలో బాగా రాణించగలరు.

మ్యాచ్ ప్రిడిక్షన్
పాకిస్తాన్, భారత్ మధ్య ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు జరగగా.. అందులో ఏడు మ్యాచ్‌లలో భారత్ గెలిచింది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా గెలుస్తుందని అంచనాలు ఉన్నాయి. అయితే, మ్యాచ్ ఉత్కంఠభరితంగా ఉంటుందని భావిస్తున్నారు. భారీ స్కోరింగ్ నమోదయ్యే అవకాశం ఉంది.

మ్యాచ్ ఎప్పుడు:
భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఈరోజు(24 అక్టోబర్ 2021) సాయంత్రం 7గంటల 30నిమిషాలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ హాట్‌స్టార్‌లో కూడా లైవ్ స్ట్రీమింగ్ వస్తుంది.

టీమ్ ఇండియా Probable XI:
రోహిత్ శర్మ, KL రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ.

పాకిస్తాన్ Probable XI:
బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(wk), ఫఖర్ జమాన్, హైదర్ అలీ, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీం, షాహీన్ షా ఆఫ్రిది, హరీస్ రవూఫ్.