Pink Ball Test : ముగిసిన రెండో రోజు ఆట.. శ్రీలంక ముందు భారీ టార్గెట్

శ్రీలంకతో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్(Pink Ball Test) మ్యాచ్ లో భారత్ పట్టు బిగించింది. శ్రీలంక ముందు భారీ లక్ష్యం ఉంచింది.

Pink Ball Test : ముగిసిన రెండో రోజు ఆట.. శ్రీలంక ముందు భారీ టార్గెట్

Pink Ball Test

Pink Ball Test : బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో(పింక్ బాల్-డే/నైట్ టెస్ట్) భారత్ పట్టు బిగించింది. శ్రీలంక ముందు భారీ లక్ష్యం ఉంచింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సెకండ్ ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఒక వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్‌ (16*), కరుణరత్నె (10*) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో జస్ప్రీత్‌ బుమ్రా ఒక వికెట్ పడగొట్టాడు. ఇంకా మూడు రోజుల ఆట మిగిలుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలుపొందాలంటే మరో 9 వికెట్లు పడగొట్టాలి. శ్రీలంక గెలవాలంటే 419 పరుగులు చేయాలి.(Pink Ball Test)

143 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్‌ 303/9 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. దీంతో లంక ముందు 447 పరుగులను లక్ష్యంగా ఉంచింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లలో శ్రేయస్‌ అయ్యర్ (67), రిషభ్‌ పంత్ (50) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. పంత్‌ కేవలం 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని టెస్టుల్లో భారత్ తరఫున వేగవంతమైన అర్ధ శతకం బాదిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

కెప్టెన్‌ రోహిత్ శర్మ (79 బంతుల్లో 46 పరుగులు.. 4 ఫోర్లు) రాణించాడు. మిగతా బ్యాటర్లలో హనుమ విహారి 35, మయాంక్‌ అగర్వాల్ 22, విరాట్ కోహ్లీ 13, రవీంద్ర జడేజా 22, అశ్విన్‌ 13, అక్షర్‌ పటేల్ 9, మహ్మద్‌ షమి 16* పరుగులు చేశారు. లంక బౌలర్లలో జయవిక్రమ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఎంబుల్దేనియా మూడు వికెట్లు తీశాడు. ధనంజయ డిసిల్వా, విశ్వ ఫెర్నాండో తలో వికెట్ తీశారు.(Pink Ball Test)

86/6 స్కోర్ తో రెండో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంకను భారత బౌలర్లు బెంబేలెత్తించారు. కట్టుదిట్టమైన బౌలింగ్ తో లంక బ్యాటర్లకు చుక్కలు చూపించారు. భారత బౌలర్ల ధాటికి శ్రీలంక 5.5 ఓవర్లలో 23 పరుగులే చేసి ఆఖరి నాలుగు వికెట్లను కోల్పోయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లంక 109 పరుగులకే కుప్పకూలింది. బుమ్రా (5/24) కీలక పాత్ర పోషించగా.. అశ్విన్‌ (2/30), షమీ (2/18), అక్షర్ (1/21) సహకారం అందించారు. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.(Pink Ball Test)

Rishabh Pant: కపిల్ దేవ్ 40ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన రిషబ్ పంత్

బెంగళూరు టెస్టులో భారత్ విజయానికి బాటలు పడ్డాయని చెప్పాలి. శ్రీలంక ముందు 447 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన టీమిండియా… అప్పుడే ఓ వికెట్ తీసి ప్రత్యర్థి జట్టు పతనానికి శ్రీకారం చుట్టింది.

భారత్ ఇప్పటివరకు మూడే పింక్ బాల్ టెస్ట్ మ్యాచులు ఆడింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య 2015 నవంబర్ 27-డిసెంబర్‌ 1 వరకు తొలి పింక్ బాల్ టెస్ట్ (డే/నైట్‌) జరిగింది. అందులో ఆసీస్‌ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు 18 టెస్టులు జరిగాయి. భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న బెంగళూరు టెస్టు అంతర్జాతీయంగా 19వ మ్యాచ్‌. రికార్డుపరంగా చూసుకుంటే… ఆస్ట్రేలియానే ఎక్కువ మ్యాచ్‌లను గెలిచింది. పది టెస్టులకుగాను పదింటిలోనూ విజయం సాధించడం విశేషం. టీమిండియాకు మాత్రం ఇది నాలుగో డే/నైట్ టెస్టు. మిగతా మూడు మ్యాచుల్లో భారత్‌ రెండు విజయాలు, ఒక ఘోర ఓటమి చవిచూసింది.

IND vs SL : రోహిత్ కొట్టిన షాట్‌‌కు ప్రేక్షకుడి ముక్కు పగిలింది..

శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్‌ 222 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పింక్ బాల్ టెస్టులోనూ గెలిచి క్లీన్‌స్వీప్‌ చేయాలని భారత్‌ భావిస్తోంది.