IndVsEng 1st ODI : అదరగొట్టిన భారత్.. తొలి వన్డేలో ఇంగ్లండ్‌పై సూపర్ విక్టరీ

ఇంగ్లండ్ తో తొలి వన్డేలో భారత్ అదరగొట్టింది. అటు బౌలింగ్ లో, ఇటు బ్యాటింగ్ లో.. సమష్టిగా రాణించి సూపర్ విక్టరీ కొట్టింది.

IndVsEng 1st ODI : అదరగొట్టిన భారత్.. తొలి వన్డేలో ఇంగ్లండ్‌పై సూపర్ విక్టరీ

Indvseng 1st Odi

IndVsEng 1st ODI : ఇంగ్లండ్ తో తొలి వన్డేలో భారత్ అదరగొట్టింది. అటు బౌలింగ్ లో, ఇటు బ్యాటింగ్ లో.. సమష్టిగా రాణించి ఇంగ్లండ్ పై సూపర్ విక్టరీ సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 111 పరుగుల టార్గెట్ ను టీమిండియా వికెట్‌ నష్టపోకుండా 18.4 ఓవర్లలోనే ఛేజ్ చేసింది.

ఓపెనర్లు రోహిత్ శర్మ (76*), శిఖర్ ధావన్‌ (31*) అజేయంగా నిలిచి జట్టుని గెలిపించారు. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 58 బంతుల్లో 76 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 7 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. ఇన్నింగ్స్‌ ఆరంభంలో ఆచితూచి ఆడిన ఈ జోడీ తర్వాత దూకుడు పెంచి జట్టుకి విజయాన్ని కట్టబెట్టింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అంతకముందు ఇంగ్లండ్ వికెట్ల పతనంలో పేసర్‌ బుమ్రా కీ రోల్ ప్లే చేశాడు. 6 వికెట్ల తీసి అద్భుత ప్రదర్శన చేశాడు.(IndVsEng 1st ODI)

తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ను బుమ్రా దారుణంగా దెబ్బతీశాడు. బుమ్రా (6/19) దెబ్బకు ఇంగ్లండ్‌ 110 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోస్‌ బట్లర్‌ (30), డేవిడ్ విల్లే (21), కార్సే (15), మొయిన్ అలీ (14) మాత్రమే రెండంకెల స్కోరును నమోదు చేశారు. మిగతా వారిలో బెయిర్‌స్టో 7, ఓవర్టన్‌ 8, టోప్లే 6* పరుగులు చేయగా.. జాసన్‌ రాయ్‌, జో రూట్, స్టోక్స్, లివింగ్‌స్టోన్ డకౌట్‌గా వెనుదిరిగారు.

Surya Kumar Yadav: ఇండియా మిస్టర్ 360 అని సూర్యకుమార్ యాదవ్‌పై ప్రశంసలు

Rohit Sharma

Rohit Sharma

భారత బౌలర్లలో బుమ్రా బంతితో నిప్పులు చెరిగాడు. 7.2 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీశాడు. అందులో మూడు మెయిడిన్ ఓవర్లు ఉండటం విశేషం. షమీ మూడు వికెట్లు పడగొట్టాడు. ప్రసిధ్ ఒక వికెట్ తీశాడు.

Rohit Sharma: కోహ్లీ ఫామ్ గురించి మాట్లాడాలంటే ఇది గుర్తుపెట్టుకోండి – రోహిత్ శర్మ

టాస్‌ నెగ్గిన భారత్‌..
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత్ వన్డే సిరీస్‌ కోసం పోటీ పడుతోంది. వాయిదా పడిన టెస్టు మ్యాచ్‌లో ఓటమి పాలైనప్పటికీ.. టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన భారత్‌ సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. ఇప్పుడు వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. లండన్‌లోని ఓవల్‌ మైదానం వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో టాస్‌ నెగ్గిన భారత కెప్టెన్‌ రోహిత్ శర్మ బౌలింగ్‌ ఎంచుకొని ఇంగ్లండ్‌కు బ్యాటింగ్‌ అప్పగించాడు.

ఇంగ్లండ్‌ జట్టు‌:
జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, జోయ్‌ రూట్, బెన్‌ స్టోక్స్‌, జోస్ బట్లర్‌ (కెప్టెన్‌), లియామ్‌ లివింగ్‌స్టోన్‌, మొయిన్ అలీ, క్రెగ్ ఓవర్టన్, డేవిడ్ విల్లే, కార్సే, టోప్లే.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్‌), శిఖర్ ధావన్‌, శ్రేయస్‌ అయ్యర్, సూర్యకుమార్‌ యాదవ్, రిషభ్‌ పంత్, హార్దిక్‌, రవీంద్ర జడేజా, షమీ ,బుమ్రా, చాహల్, ప్రసిధ్ కృష్ణ.