Roger Binny: బీసీసీఐ నూతన అధ్యక్షుడు రోజర్ బిన్నీ పూర్వికులు ఏ దేశస్తులో తెలుసా? బిన్నీ గురించి ఆసక్తికర విషయాలు ..
కర్ణాటకలోని బెంగుళూరులో 1955 జూలై 19న జన్మించిన రోజర్ బిన్నీ పూర్తి పేరు రోజర్ మైకెల్ హంప్రీ బిన్నీ. రోజర్ బిన్నీ పూర్వికులు స్కాట్లాండ్ నుంచి భారత్‌కు వచ్చారు. ఆరుగురు సోదరులతో కూడిన ఆంగ్లో-ఇండియన్ కుటుంబంలో జన్మించిన బిన్నీ.. బెంగళూరులోని బెన్సన్ టౌన్‌లోని కంటోన్మెంట్ ప్రాంతంలో పెరిగాడు.

Rojar binny
Roger Binny: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) 36వ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ (రోజర్ మైకేల్ హంఫెరీ బిన్నీ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు గంగూలీ నుంచి బిన్నీ బాధ్యతలు తీసుకోనున్నారు. సుదీర్ఘ క్రికెట్ ఆడిన బిన్నీ మంచి ఆల్ రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. 1983 సంవత్సరంలో జరిగిన ప్రపంచ కప్ లో భారత్ జట్టు విజయం సాధించడంలో బిన్నీ కీలక భూమిక పోషించాడు. కపీల్ దేవ్ నేతృత్వంలో భారత్ జట్టులో ఎనిమిది మ్యాచ్ లలో మొత్తం 18 వికెట్లు తీసి బిన్నీ అప్పట్లో చరిత్ర సృష్టించాడు.
BCCI President Roger Binny: బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ.. ఏకగ్రీవంగా ఎన్నిక
రోజర్ బిన్నీ గురించి ఆసక్తికర విషయాలు..
– కర్ణాటకలోని బెంగుళూరులో 1955 జూలై 19న జన్మించిన రోజర్ బిన్నీ పూర్తి పేరు రోజర్ మైకెల్ హంప్రీ బిన్నీ.
– రోజర్ బిన్నీ పూర్వికులు స్కాట్లాండ్ నుంచి భారత్‌కు వచ్చారు.
– ఆరుగురు సోదరులతో కూడిన ఆంగ్లో-ఇండియన్ కుటుంబంలో జన్మించిన బిన్నీ బెంగళూరులోని బెన్సన్ టౌన్‌లోని కంటోన్మెంట్ ప్రాంతంలో పెరిగాడు.
– నగరంలోని అనేక మంది క్రీడా ప్రముఖులకు నిలయంగా ఉన్నందుకు ఛాంపియన్ టౌన్ అని కూడా పిలుస్తారు.
– 1975-76 సీజన్‌లో కర్ణాటక తరపున తన రంజీ ట్రోఫీ అరంగేట్రం చేశాడు. బ్యాట్, బాల్ రెండింటితో అనేక విజయాలకు సాధించాడు.
– స్కూల్ స్టేజ్ నుంచే బిన్నీ క్రికెట్, ఫుట్ బాల్, హాకీ లాంటి క్రీడలు ఎక్కువగా ఆడేవారు.
– జావెలిన్‌లో పురుషుల విభాగంలో జాతీయ స్థాయిలో ఆయన ప్రతిభ కనబరిచారు. కానీ, ఆయన బౌలింగ్ కూడా అదే స్థాయిలో చేయగలరు. అందుకే ఆయన జావెలిన్ నుంచి క్రికెట్ దిశగా అడుగులు వేశారు.
– 1979 బెంగళూరులోని చినస్వామి స్టేడియం పాకిస్థాన్‌పై మ్యాచ్‌తో టెస్టుల్లోకి బిన్నీ అరంగ్రేటం చేశారు.
– 1983 ప్రపంచ కప్ టోర్నీ రోజర్ బిన్నీకి గుర్తింపు తెచ్చింది.
– కపిల్ దేవ్ నేతృత్వంలో ఎనిమిది మ్యాచ్‌లలో మొత్తంగా 18 వికెట్లు తీసి 1983 వరల్డ్‌కప్‌లో బిన్నీ చరిత్ర సృష్టించారు.
– వరల్డ్ కప్‌లో మాత్రమే కాదు. 1985లో ఆస్ట్రేలియాలో జరిగిన వరల్డ్ సిరీస్ చాంపియన్‌షిప్‌లోనూ రోజర్ బిన్నీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు.
– తన క్రికెట్ కెరియర్‌లో బిన్నీ 27 టెస్టులు ఆడాడు. 830 పరుగులు చేయగా, 47 వికెట్లు తీశాడు. 72 వన్‌డే మ్యాచ్‌లు ఆడిన బిన్నీ 77 వికెట్లు చేయగా, 629 పరుగులు చేశాడు.
– సెలక్టర్‌తోపాటు బీసీసీఐలో కోచ్‌గానూ బిన్నీ సేవలు అందించారు. 2000 అండర్-19 వరల్డ్ కప్ జట్టుకు ఆయన కోచ్‌గా వ్యవహరించారు.
– ఈ జట్టు నుంచి మహమ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్ లాంటి క్రికెటర్లు వచ్చారు. ఆ తర్వాత కాలంలో వీరు భారత్ జట్టులో ఒక వెలుగు వెలిగారు.
– క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత మొదట ఆసియన్ క్రికెట్ కౌన్సిల్‌లో ఆయన పనిచేశారు. దీనిలో భాగంగా భిన్న దేశాలను సందర్శించి అక్కడి పిల్లలకు క్రికెట్‌లో మెళకువలు నేర్పించారు.
– అవకతవకలు జరిగాయని లోథా కమిటీ ఆరోపణలు చేసిన వెంటనే, బీసీసీఐ సెలక్టర్ పదవికి అప్పట్లో ఆయన రాజీనామా చేశారు.
– రోజర్ బిన్నీ.. సెలక్టర్‌గా బీసీసీఐలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు.
– అప్పుడే తన కొడుకు స్టువార్ట్ బిన్నీ భారత్ జట్టుకు ఆడేందుకు ప్రయత్నాలు చేసేవారు. ఆయన కొడుకుపై పక్షపాతం చూపించేవారని మొదట్లో వార్తలు వచ్చేవి.
– స్టువార్ట్ బిన్నీని జట్టుకు ఎంపిక చేసే సమయం వచ్చేసరికి.. చర్చ మొదలు కాకముందే మీటింగ్ రూమ్‌ను వదిలి బిన్నీ బయటకు వెళ్లిపోయేవారు.
– అలా తను పక్షపాతం చూపించారనే వార్తలకు ఆయన సమాధానం చెప్పారు.
– బిన్నీ కర్నాటక క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా చేశారు.
– ప్రస్తుతం బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.