BCCI President Roger Binny: బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ.. ఏకగ్రీవంగా ఎన్నిక

భారత జట్టు మాజీ క్రికెటర్, 1983 ప్రపంచ కప్ విజేత జట్టులో కీలక ఆటగాడు రోజర్ బిన్నీ మంగళవారం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) 36వ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ముంబైలో జరిగిన బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో అతని నియామకాన్ని ఏకగ్రీవంగా ప్రకటించింది.

BCCI President Roger Binny: బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ.. ఏకగ్రీవంగా ఎన్నిక

BCCI President

BCCI President Roger Binny: భారత జట్టు మాజీ క్రికెటర్, 1983 ప్రపంచ కప్ విజేత జట్టులో కీలక ఆటగాడు రోజర్ బిన్నీ మంగళవారం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) 36వ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ముంబైలో జరిగిన బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో అతని నియామకాన్ని ప్రకటించారు. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్థానంలో 67ఏళ్ల బిన్నీ ఒక్కరే బీసీసీఐ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన విషయం విధితమే.

BCCI President: బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ.. రవిశాస్త్రి స్పందన ఏమిటంటే?

బిన్నీ ఇటీవలి కాలంలో కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు ఆ పదవిని ఒదులుకోనున్నాడు. మీడియం పేసర్ అయిన బిన్నీ 1983లో ఇండియా సాధించిన చారిత్రాత్మక ప్రపంచ కప్ జట్టులో కీలక ఆటగాడు. గతంలో సందీప్ పాటిల్ చైర్మన్‌గా ఉన్నప్పుడు బిన్నీ సీనియర్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా పనిచేశాడు. ఇప్పటి వరకు బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఉన్న గంగూలీ గత వారం న్యూఢిల్లీలో బోర్డు సభ్యులతో సమావేశమయ్యాడు. మరోసారి బీసీసీఐ ప్రెసిడెంట్ పదవికి అవకాశం కోసం ప్రయత్నించినప్పటికీ అందుకు బోర్డు నిరాకరించినట్లు తెలిసింది. రెండోసారి బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఇచ్చే సాంప్రదాయం లేదని బోర్డు గంగూలీని పక్కన పెట్టింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

67ఏళ్ల బిన్నీ క్రికెట్‌లో సుదీర్ఘ కెరీర్‌ను కలిగిన వ్యక్తి. అతను 1979 – 1987 మధ్య 27 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు, 47 వికెట్లు తీశాడు. 1980 – 1987 మధ్య 72 వన్డేలు ఆడాడు. బిన్నీ ఆడిన వన్డేల్లో అతిపెద్ద ఘనత 1983 ప్రపంచ కప్. అతని కోచింగ్ కెరీర్‌లో.. 2012 నుండి రంజీ ట్రోఫీలో బెంగాల్, కర్ణాటక జట్లతో కలిసి పనిచేశాడు. బిన్నీ జాతీయ సీనియర్ సెలక్షన్ కమిటీలో పనిచేశాడు. కానీ 2015లో బిన్నీని తొలగించారు. 2019లో కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.