BCCI President: బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ.. రవిశాస్త్రి స్పందన ఏమిటంటే?

బీసీసీఐ అధ్యక్షుడిగా 1983 ప్రపంచ కప్ విజయంలో కీలక సభ్యుడైన రోజర్ బిన్నీ పేరు దాదాపు ఖరారైంది. అక్టోబర్ 18న బీసీసీఐ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమయ్యాడు. బిన్నీ ఎంపిక పట్ల భారత్ జట్టు మాజీ కోచ్ రవిశాస్త్ర స్పందించారు.

BCCI President: బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ.. రవిశాస్త్రి స్పందన ఏమిటంటే?

Ravi Shastri

BCCI President: బీసీసీఐ అధ్యక్షుడిగా 1983 ప్రపంచ కప్ విజయంలో కీలక సభ్యుడైన రోజర్ బిన్నీ పేరు దాదాపు ఖరారైంది. అక్టోబర్ 18న బీసీసీఐ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమయ్యాడు. ప్రస్తుతం భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. మరోసారి గంగూలీ అధ్యక్ష స్థానంకోసం ప్రయత్నించినప్పటికీ బోర్డు ఒప్పుకోకపోవటంతో గంగూలీ స్థానంను బిన్నీ భర్తీ చేయనున్నారు. అయితే, మరోసారి బీసీసీఐ అధ్యక్ష స్థానానికి గంగూలీని ఎంపిక చేయకపోవటం రాజకీయ దుమారానికి తెరతీసింది.

BCCI President: బీసీసీఐ తదుపరి అధ్యక్షుడిగా టీమిండియా మాజీ పేసర్ రోజర్ బిన్నీ?

బీజేపీలో చేరనందుకే గంగూలీని బీసీసీఐ అధ్యక్ష స్థానం నుంచి తప్పిస్తున్నారని టీఎంసీ ఆరోపించింది. ఈ క్రమంలో టీఎంసీ, బీజేపీ నేతల మధ్య మాటల వార్ కొనసాగుతుంది. తాజా పరిణామాల నేపథ్యంలో భారత మాజీ కోచ్, బిన్నీ మాజీ సహచరుడు రవిశాస్త్రి స్పందించారు. బీసీసీఐ అధ్యక్షుడిగా బిన్నీ ఎంపికకు మార్గం సుగమం కావటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. బిన్నీ విజయవంతమైన బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతాడని, ఆయన ఆమేరకు అన్నివిధాల సామర్థ్యాలు కలిగిన వ్యక్తి అంటూ రవిశాస్త్రి పేర్కొన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

బిన్నీ ఎంపికపట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే అతను ప్రపంచ కప్‌లో నా సహచర ఆటగాడు. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నందున ఆయనకు బీసీసీఐ అధ్యక్షుడిగా అన్ని అర్హతలు ఉన్నాయి. ప్రపంచ కప్ విజేత బీసీసీఐ చరిత్రలో తొలిసారిగా అధ్యక్షుడయ్యాడు. అతని ప్రతిభపై నాకెలాంటి సందేహం లేదని అనన్నాడు.