ఐపీఎల్ ముందే స్టార్ మ్యాచ్: ధోనీ, కోహ్లీ, రోహిత్ ఒకే టీమ్‌లో!

  • Published By: vamsi ,Published On : February 17, 2020 / 09:43 AM IST
ఐపీఎల్ ముందే స్టార్ మ్యాచ్: ధోనీ, కోహ్లీ, రోహిత్ ఒకే టీమ్‌లో!

ఎప్పుడెప్పుడా అని క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)- 2020 షెడ్యూల్ వచ్చేసింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ ఆల్‌స్టార్ గేమ్ గురించి ఊహాగానాలు ఊపందుకున్నాయి. మార్చి 29న ముంబైలోని వాంఖడే మైదానంలో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్‌ మ్యాచ్‌తో ఈ క్యాష్‌రిచ్ లీగ్‌ స్టార్ట్ అవ్వనుంది. 

ఈ క్రమంలోనే ఐపీఎల్ ఆల్ స్టార్ గేమ్ గురించి వార్తలు వస్తున్నాయి. ది టెలిగ్రాఫ్ కథనం ప్రకారం.. ముంబై వేదికగానే మెగా టోర్నీ ఆరంభానికి నాలుగు రోజుల ముందు మార్చి 25వ తేదీన ఆల్ స్టార్ టోర్నీని నిర్వహించే యోచనలో బీసీసీఐ ఉందనే ప్రచారం జోరుగా సాగుతుంది. సహాయ కార్యక్రమాల నిధుల సేకరణ కోసం సీజన్‌కు ముందే ఎనిమిది జట్ల ఆటగాళ్లను విడదీసి ఆల్‌స్టార్ మ్యాచ్ నిర్వహిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇప్పటికే ప్రకటింజచారు. 

ఈ క్రమంలోనే మార్చి 25న వాంఖడే స్టేడియంలో ఇందుకోసం బీసీసీఐ కసరత్తులు చేస్తుంది. నార్త్ అండ్ ఈస్ట్ ఆఫ్ ఇండియా.. సౌత్ అండ్ వెస్ట్ ఆఫ్ ఇండియాగా ఎనిమిది జట్లను రెండు జట్లుగా మార్చి ఈ మ్యాచ్ ఆడించనున్నారు. దీని ప్రకారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ నార్త్ అండ్ ఈస్ట్ ఆఫ్ ఇండియా.. కిందకు చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు ముంబై ఇండియన్స్ సౌత్ అండ్ వెస్ట్ ఆఫ్ ఇండియా కిందకు వస్తాయి.

ఇలా నాలుగు జట్లలోని కీలక ఆటగాళ్లు తుది జట్లుగా బరిలోకి దిగి ఆడుతారు. దీంతో టీమిండియా లెజండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, ప్రస్తుత టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ రోహిత్ శర్మ ఒకే జట్టులో ఉండే అవకాశం ఉంది. ఇక వీరితో పాటు జస్ప్రిత్ బుమ్రా, విలియమ్సన్, రషీద్ ఖాన్‌లు కూడా ఉంటారు. మరో జట్టులో కేఎల్ రాహుల్, స్టీవ్ స్మిత్, బెన్ స్టోక్స్, అశ్విన్, ఆర్చర్, అయ్యర్, రిషబ్ పంత్‌లలు ఉండనున్నారు. 

సౌత్ వెస్ట్ టీమ్‌కు కెప్టెన్‌గా ధోని, నార్త్ ఈస్ట్ టీమ్‌ కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ ఉండే అవకాశం ఉంది. 

జట్ల అంచనాలు: 
సౌత్ అండ్ వెస్ట్ ఆఫ్ ఇండియా…
రోహిత్, వార్నర్, కోహ్లీ. కేన్ విలియమ్సన్. ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), పోల్లార్డ్, హార్దిక్ పాండ్యా, తాహిర్, దీపక్ చాహర్, రషీద్ ఖాన్, బుమ్రా

నార్త్ అండ్ ఈస్ట్ ఆఫ్ ఇండియా…
కేఎల్ రాహుల్,  ధావన్, స్మిత్(కెప్టెన్), శ్రీయస్ అయ్యర్, పంత్(వికెట్ కీపర్), స్టోక్స్, రస్సెల్, రబడ, షమీ, గోపాల్, కుల్దీప్

Read More>>పిచ్చి పీక్స్ : పీటలపై మొబైల్ ఫోన్లు.. వీడియో కాల్‌లో ఎంగేజ్ మెంట్ చూడండీ..!!