IPL 2023: ఢిల్లీ పై చెన్నై ఘ‌న విజ‌యం

ఐపీఎల్ 2023లో భాగంగా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఘ‌న విజ‌యం సాధించింది.

IPL 2023: ఢిల్లీ పై చెన్నై ఘ‌న విజ‌యం

DC vs CSK

DC vs CSK: ఐపీఎల్ 2023లో భాగంగా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఘ‌న విజ‌యం సాధించింది. తద్వారా ఈ సీజ‌న్‌లో ప్లే ఆఫ్స్ కు చేరిన రెండో జ‌ట్టుగా చెన్నై నిలిచింది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 20 May 2023 07:17 PM (IST)

    చెన్నై ఘ‌న విజ‌యం

    ఐపీఎల్ 2023లో భాగంగా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఘ‌న విజ‌యం సాధించింది. తద్వారా ఈ సీజ‌న్‌లో ప్లే ఆఫ్స్ కు చేరిన రెండో జ‌ట్టుగా చెన్నై నిలిచింది. ల‌క్ష్య ఛేద‌న‌లో ఢిల్లీ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 146 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది.

  • 20 May 2023 06:38 PM (IST)

    అక్ష‌ర్ ప‌టేల్ ఔట్‌

    ఢిల్లీ మ‌రో వికెట్ కోల్పోయింది. దీప‌క్ చాహ‌ర్ బౌలింగ్‌లో అక్ష‌ర్ ప‌టేల్(15) రుతురాత్ చేతికి చిక్కాడు. దీంతో ఢిల్లీ 109 ప‌రుగుల(13.3వ ఓవ‌ర్‌) వ‌ద్ద ఐదో వికెట్ కోల్పోయింది.

  • 20 May 2023 05:59 PM (IST)

    వ‌రుస బంతుల్లో సాల్ట్‌, రూసో ఔట్‌

    ఢిల్లీకి వ‌రుస షాక్‌లు త‌గులుతున్నాయి. వ‌రుస బంతుల్లో సాల్ట్‌, రూసో ఔట్ అయ్యారు. ఐదో ఓవ‌ర్‌ను దీప‌క్ చాహ‌ర్ వేయ‌గా నాలుగో బంతికి ఫిలిఫ్ సాల్ట్ (5) ర‌హానే చేతికి చిక్క‌గా, ఐదో బంతికి రిలీ రూసో(0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఢిల్లీ 26 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. 5 ఓవ‌ర్లకు ఢిల్లీ స్కోరు 26/3. యశ్‌ ధుల్(0), డేవిడ్ వార్న‌ర్‌(18) లు క్రీజులో ఉన్నారు.

  • 20 May 2023 05:41 PM (IST)

    పృథ్వీ షా ఔట్

    భారీ లక్ష్య‌న్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన ఢిల్లీ జ‌ట్టుకు ఆదిలోనే షాక్ త‌గిలింది. పృథ్వీ షా(5) ఔట్ అయ్యాడు. షార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో రాయుడు క్యాచ్ అందుకోవ‌డంతో పృథ్వీ పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో ఢిల్లీ 5 ప‌రుగుల‌(1.3వ ఓవ‌ర్‌)కే తొలి వికెట్ కోల్పోయింది. 2 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 61. డేవిడ్ వార్న‌ర్ (0), ఫిలిఫ్ సాల్ట్ క్రీజులో ఉన్నారు.

  • 20 May 2023 05:15 PM (IST)

    ఢిల్లీ ల‌క్ష్యం 224

    కీల‌క మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్ల న‌ష్టానికి 223 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్లు డెవాన్ కాన్వే (87; 52 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), రుతురాజ్ గైక్వాడ్‌(79; 50 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) అర్ధ‌శ‌త‌కాల‌తో రాణించ‌గా, ఆఖ‌ర్లో శివ‌మ్ దూబే(22; 9 బంతుల్లో 3సిక్స‌ర్లు), ర‌వీంద్ర జ‌డేజా(20 నాటౌట్; 5 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్‌) దూకుడుగా ఆడారు. ఢిల్లీ బౌల‌ర‌ల్లో చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నోర్జే త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

  • 20 May 2023 05:04 PM (IST)

    శివ‌మ్ దూబె ఔట్‌

    చెన్నై మ‌రో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న శివ‌మ్ దూబే(9 బంతుల్లో 22) ఔట్ అయ్యాడు. 18వ ఓవ‌ర్‌ను ఖ‌లీల్ అహ్మ‌ద్ వేయ‌గా రెండు సిక్స‌ర్లు కొట్టిన దూబే అదే ఊపులో ఆఖరి బంతికి మ‌రో భారీ షాట్‌కు య‌త్నించి ల‌లిత్ యాద‌వ్ చేతికి చిక్కాడు. దీంతో 195 ప‌రుగుల(17.5వ ఓవ‌ర్‌) వ‌ద్ద చెన్నై రెండో వికెట్ కోల్పోయింది.

  • 20 May 2023 04:45 PM (IST)

    రుతురాజ్ గైక్వాడ్ ఔట్

    ఎట్ట‌కేల‌కు ఢిల్లీ బౌల‌ర్లు వికెట్ ప‌డ‌గొట్టారు. చేతన్ సకారియా బౌలింగ్‌లో రిలీరొసో క్యాచ్ అందుకోవ‌డంతో రుతురాజ్ గైక్వాడ్ (79) ఔట్ అయ్యాడు. దీంతో 141 ప‌రుగుల(14.3వ ఓవ‌ర్‌) వ‌ద్ద చెన్నై మొద‌టి వికెట్ కోల్పోయింది. 15 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోరు 148/1. శివ‌మ్ దూబె(1), డెవాన్ కాన్వే(65)లు క్రీజులో ఉన్నారు.

  • 20 May 2023 04:37 PM (IST)

    డెవాన్ కాన్వే అర్ధ‌శ‌త‌కం

    ఖ‌లీల్ అహ్మ‌ద్ బౌలింగ్‌లో(13.1వ ఓవ‌ర్‌) సిక్స్ కొట్టి డెవాన్ కాన్వే 32 బంతుల్లో హాప్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు.

  • 20 May 2023 04:28 PM (IST)

    ఒకే ఓవ‌ర్‌లో 20 ప‌రుగులు

    అర్ధ‌శ‌త‌కం త‌రువాత రుతురాజ్ గైక్వాడ్ వేగం పెంచాడు. 12వ ఓవ‌ర్‌ను కుల్దీప్ యాద‌వ్ వేయ‌గా హ్యాట్రిక్ సిక్స‌ర్లు కొట్టాడు. దీంతో ఈ ఓవ‌ర్‌లో 20 ప‌రుగులు వ‌చ్చాయి. 12 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోరు 117/0. డెవాన్ కాన్వే (45), రుతురాజ్ గైక్వాడ్(70)లు క్రీజులో ఉన్నారు.

  • 20 May 2023 04:20 PM (IST)

    రుతురాజ్ గైక్వాడ్ అర్ధ‌శ‌త‌కం

    అక్ష‌ర్ ప‌టేల్ బౌలింగ్‌లో(9.5వ ఓవ‌ర్‌) సింగిల్ తీసి 37 బంతుల్లో రుతురాజ్ గైక్వాడ్ అర్ధ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇందులో 3 ఫోర్లు, 3 సిక్స‌ర్లు ఉన్నాయి. ఈ సీజ‌న్‌లో రుతురాజ్‌కు ఇది మూడో హాఫ్ సెంచ‌రీ. 10 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోరు 87/0. రుతురాత్ గైక్వాడ్ 50, డెవాన్ కాన్వే 35 లు క్రీజులో ఉన్నారు.

  • 20 May 2023 03:59 PM (IST)

    దూకుడుగా ఆడుతున్న చెన్నై ఓపెన‌ర్లు

    కీల‌క మ్యాచ్‌లో చెన్నై ఓపెన‌ర్లుగా దూకుడుగా ఆడుతున్నారు. ప‌వ‌ర్ ప్లే(6 ఓవ‌ర్లు) ముగిసే స‌రికి చెన్నై స్కోరు 52 0. రుతురాజ్ గైక్వాడ్ 21 బంతుల్లో 22, డెవాన్ కాన్వే 15 బంతుల్లో 28 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

  • 20 May 2023 03:14 PM (IST)

    చెన్నై సూపర్ కింగ్స్ తుది జ‌ట్టు

    రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్‌ ధోని(వికెట్ కీప‌ర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ

  • 20 May 2023 03:14 PM (IST)

    ఢిల్లీ క్యాపిటల్స్ తుది జ‌ట్టు

    డేవిడ్ వార్నర్ (కెప్టెన్‌), ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీప‌ర్‌), రిలీ రోసొ, యష్ ధుల్, అమన్ హకీమ్ ఖాన్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నోర్జే

  • 20 May 2023 03:12 PM (IST)

    టాస్ గెలిచిన చెన్నై

    ఐపీఎల్ 2023లో భాగంగా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ల‌ప‌డుతోంది. టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోని బ్యాటింగ్ ఎంచుకున్నాడు.