అతను చాలా స్పెషల్ ఇంకా ప్రమాదకరం కూడా: సచిన్

అతను చాలా స్పెషల్ ఇంకా ప్రమాదకరం కూడా: సచిన్

టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ Mumbai Indians బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్‌ను తెగ పొగిడేస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో ఆడిన మ్యాచ్‌లో ముంబై బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ వీరపోరాటం జట్టును గెలిపించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో జరిగిన 20వ మ్యాచ్‌లో యాదవ్ అదరగొట్టాడు.

దీంతో ముంబై ఇండియన్స్ 4వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేయగలిగింది. ముంబై బౌలర్లు బుమ్రా లాంటి పనితనంతో రాయల్స్ 136పరుగులకే చాప చుట్టేసింది. ఫలితంగా 57పరుగుల తేడాతో పరాజయం నెత్తినేసుకుంది.



ఈ మ్యాచ్ తర్వాత సచిన్ టెండూల్కర్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్పందించాడు. ‘సూర్యకుమార్ యాదవ్ ఓ స్పెషల్, చాలా ప్రమాదకరమైన ప్లేయర్. మైదానంలో అన్ని వైపులా ఆడగలిగే సత్తా ఉన్నవాడు’ అంటూ పోస్టు పెట్టాడు.

ఆ తర్వాత లెజెండరీ ప్లేయర్ బుమ్రాపైనా పొగడ్తలు కురిపించారు. స్టీవ్ స్మిత్, రాహుల్ తెవాటియా లాంటి హిట్టర్లతో పాటు ఆల్ రౌండర్లు జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్ లను చిత్తు చేశాడు.

‘ముంబై ప్లేయర్లు బ్యాటింగ్, బౌలింగ్ లతో స్ట్రాంగ్ పర్‌ఫార్మెన్స్ చేశారు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్లు పడగొట్టి కట్టడి చేశారు. అద్భుతమైన బుమ్రా బౌలింగ్ ను చూసి ఎంజాయ్ చేశాను’ అని సచిన్ రాశాడు.

‘గేమ్ కు ముందు నేను అతనితో మాట్లాడాను. చక్కటి బ్యాటింగ్ చేశాడు. ఇదొక గుడ్ స్టార్ట్. కొన్ని సార్లు షాట్ కొట్టడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇవాళ అతను కొట్టిన షాట్లు పర్ఫెక్ట్ గా ఉన్నాయి’ అని మ్యాచ్ తర్వాత రోహిత్ పేర్కొన్నాడు.

‘చివరి వరకూ అతని ఇన్నోవేటివ్ షాట్స్ గెలిచేలా చేశాయి’ అని సచిన్ పేర్కొన్నాడు.