IPL2022 KKR Vs DC : ఢిల్లీ బౌలర్ల విజృంభణ, కోల్‌కతా స్కోర్ ఎంతంటే..

టాస్ నెగ్గిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ బౌలర్లు విజృంభించారు. కోల్ కతా బ్యాటర్లను బెంబేలెత్తించారు. దీంతో కోల్ కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి..

IPL2022 KKR Vs DC : ఢిల్లీ బౌలర్ల విజృంభణ, కోల్‌కతా స్కోర్ ఎంతంటే..

Ipl2022 Kkr Vs Dc

IPL2022 KKR Vs DC : ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా గురువారం కోల్ కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ నెగ్గిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ బౌలర్లు విజృంభించారు. కోల్ కతా బ్యాటర్లను బెంబేలెత్తించారు. దీంతో కోల్ కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులే చేసింది. ఢిల్లీ ముందు 147 పరుగుల టార్గెట్ నిర్దేశించింది.

Virat Kohli : సమంత సాంగ్‌‌కు కోహ్లీ స్టెప్స్.. వీడియో వైరల్

ఢిల్లీ బ్యాటర్లలో నితీశ్‌ రాణా (57) హాఫ్ సెంచరీతో రాణించాడు. రానా 34 బంతుల్లో 57 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో నాలుగు సిక్స్ లు, మూడు ఫోర్లు ఉన్నాయి. శ్రేయస్‌ అయ్యర్ (42), రింకు సింగ్ (23) పర్లేదనిపించారు. మిగతా వారు ఎవరూ రాణించలేదు. ఆరోన్‌ ఫించ్‌ 3, వెంకటేశ్‌ అయ్యర్ 6, బాబా ఇంద్రజిత్ 6 పరుగులు చేశారు. సునిల్ నరైన్, ఆండ్రూ రస్సెల్, టిమ్‌ సౌథీ డకౌట్‌ అయ్యారు. ఢిల్లీ బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ముస్తాఫిజర్‌ మూడు వికెట్లు తీశాడు. వీరిద్దరూ కోల్‌కతాను దెబ్బ కొట్టారు. చేతన్ సకారియా (1/17), అక్షర్ పటేల్ (1/28) చెరో వికెట్ తీశారు.(IPL2022 KKR Vs DC)

Virat Kohli: వివ్ రిచర్డ్స్‌ను ఇంప్రెస్ చేసిన విరాట్ కోహ్లీ

టీ20 టోర్నీ ఇంట్రెస్టింగ్ సాగుతోంది. లీగ్ దశలో పది జట్లూ విజయాల కోసం పోరాడుతున్నాయి. ఈ క్రమంలో ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఢిల్లీ కేపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్‌ నెగ్గిన ఢిల్లీ కెప్టెన్ రిషభ్‌ పంత్‌ బౌలింగ్‌ ఎంచుకుని శ్రేయస్‌ సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. గత సీజన్‌ వరకు రిషబ్ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌ ఒకే జట్టు తరఫున ఆడారు. ఇప్పుడు ప్రత్యర్థులుగా మారి తలపడుతున్నారు.

ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించింది. మరి ఈసారి కోల్‌కతా ప్రతీకారం తీర్చుకుంటుందో లేదో చూడాలి. ఢిల్లీ, కోల్‌కతా పాయింట్ల పట్టికలో ఏడు, ఎనిమిదో స్థానాల్లో కొనసాగుతున్నాయి. ప్లే ఆఫ్స్‌ అవకాశాలను మెరుగుపరుచుకోవాలంటే తప్పనిసరిగా విజయం సాధించాల్సిందే.

జట్ల వివరాలు:

కోల్‌కతా నైట్ రైడర్స్ : ఆరోన్‌ ఫించ్‌, సునిల్ నరైన్, శ్రేయస్‌ అయ్యర్ (కెప్టెన్‌), నితీశ్ రానా, వెంకటేశ్‌ అయ్యర్, బాబా ఇంద్రజిత్‌, రింకు సింగ్, ఆండ్రూ రస్సెల్, ఉమేశ్ యాదవ్‌, టిమ్ సౌథీ, హర్షిత్ రానా.

ఢిల్లీ కేపిటల్స్ : పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (కెప్టెన్), లలిత్ యాదవ్, రోవ్‌మన్‌ పావెల్, అక్షర్‌ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్‌దీప్‌ యాదవ్‌, ముస్తాఫిజర్‌ రహ్మాన్, చేతన్ సకారియా.