IPL Team: ఐపీఎల్ కొత్త జట్టు యజమానికి బెట్టింగ్ కంపెనీ? చిక్కుల్లో ఫ్రాంచైజీ!

క్రికెట్ క్రీడాభిమానులను పరుగుల మత్తులో ముంచెత్తే ఐపీఎల్ వచ్చే ఏడాదికి అప్పుడే రంగం సిద్ధమైంది.

IPL Team: ఐపీఎల్ కొత్త జట్టు యజమానికి బెట్టింగ్ కంపెనీ? చిక్కుల్లో ఫ్రాంచైజీ!

Ipl

IPL Team: క్రికెట్ క్రీడాభిమానులను పరుగుల మత్తులో ముంచెత్తే ఐపీఎల్ వచ్చే ఏడాదికి అప్పుడే రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఎనిమిది టీమ్‌లు బరిలో ఉండగా.. వచ్చే ఏడాది మరో రెండు టీమ్‌లు ఐపీఎల్‌లో ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఐపీఎల్‌-2022లో మొత్తం 10 జట్లు టైటిల్‌ పోరులో పోటీ పడనున్నాయి. ఐపీఎల్ బరిలోకి కొత్తగా అహ్మదాబాద్, లక్నో జట్లు వచ్చి చేరాయి.

కళ్లు చెదిరే మొత్తాన్ని చెల్లించి ఈ టీమ్‌లను బడా సంస్థలు దక్కించుకున్నాయి. గోయంకాగ్రూప్‌, సీవీసీ కేపిటల్‌ పార్ట్‌నర్స్‌ బిడ్‌ విజేతలుగా నిలిచాయి. అయితే, అహ్మదాబాద్ ఫ్రాంచైజీని CVC క్యాపిటల్‌ దక్కించుకోగా.. ఆ జట్టు యాజమాన్యంపై తీవ్ర ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. బెట్టింగ్ కంపెనీలతో సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తి అంటూ విమర్శలు చేస్తున్నారు.

CPC క్యాపిటల్ స్పెక్యులేటివ్.. గ్యాంబ్లింగ్ కంపెనీలలో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు నివేదికలు ఉండడమే ఇందుకు కారణం. బెట్టింగ్, జూదంపై ఆసక్తి ఉన్న కంపెనీకి కొత్త జట్టును అప్పగించడం బీసీసీఐకి ప్రమాదమని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2013లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌, బెట్టింగ్‌ల కారణంగా ఐపీఎల్‌కు చెడ్డ పేరు వచ్చింది.

ఈ కారణంగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ రెండు ఎడిషన్ల నిషేధానికి కూడా గురయ్యాయి. అయితే, ఇప్పుడు CVC క్యాపిటల్ అహ్మదాబాద్ ఫ్రాంచైజీని రూ. 5,600 కోట్లకు అత్యధిక బిడ్‌ ద్వారా గెలుచుకుంది. 5,100 కోట్ల ఆఫర్ ఇచ్చిన అదానీ గ్రూప్‌ సెకండ్ ప్లేస్‌లో ఉంది. అదానీ గ్రూప్ బిడ్ వెనుకబడినా కూడా తర్వాత ఉన్న అవకాశాలను చూస్తుందని, ఈ క్రమంలోనే సీవీసీ క్యాపిటల్‌ను తప్పించేందుకు ఉన్న మార్గాలను చూస్తుందని అంటున్నారు.

ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ కూడా ట్వీట్ చేస్తూ.. ‘బెట్టింగ్ కంపెనీ ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయగలదు అన్నమాట. బీసీసీఐ కొత్త రూల్ తెచ్చినట్లు ఉంది. బిడ్డర్‌కు పెద్ద బెట్టింగ్ కంపెనీ ఉన్నా అనుమతి ఇస్తుంది. వాట్ నెక్స్ట్? బీసీసీఐ హోంవర్క్ చేయలేదు. అవినీతి నిరోధక శాఖ ఎలా పనిచేయగలదు?’ అంటూ ప్రశ్నించారు.