MS Dhoni: గత వరల్డ్ కప్ తర్వాతే రిటైర్ కావాలకున్న ధోనీ.. వెల్లడించిన మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్

2019 వరల్డ్ కప్ సందర్భంగా న్యూజిలాండ్‌తో జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా ఓడిపోతే ధోని రిటైర్ అవ్వాలనుకున్నాడు. ఈ విషయాన్ని ధోని, రిషబ్ పంత్ కలిసి ఉన్నప్పడు తనతో జరిగిన సంభాషణ ద్వారా తెలిసింది.

MS Dhoni: గత వరల్డ్ కప్ తర్వాతే రిటైర్ కావాలకున్న ధోనీ.. వెల్లడించిన మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్

MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో మర్చిపోలేని పేర్లలో ఒకటి ఎమ్మెస్ ధోని. కపిల్ దేవ్ తర్వాత ఇండియాకు వన్డే వరల్డ్ కప్ అందించిన కెప్టెన్‌గా చరిత్రలో నిలిచిపోతారు. టీ20 ప్రపంచ కప్ కూడా అందించాడు.

India: ఆఫ్రికాతో కలిసి మార్చిలో ఇండియా సంయుక్త విన్యాసాలు.. . వెల్లడించిన ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే

అంతేకాదు.. అంతర్జాతీయంగా ఎన్నో విజయాలు అందించిన కెప్టెన్‌గా నిలిచిన ధోనీ 2020 ఆగష్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే, అంతకంటే ముందు.. అంటే 2019లోనే రిటైర్ అవ్వాలనుకున్నట్లు అప్పటి ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ వెల్లడించాడు. ఆయన 2014–2021 వరకు భారత జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. తాజాగా ఆయన రాసిన ‘కోచింగ్ బియాండ్–మై టైమ్ విత్ ద ఇండియన్ క్రికెట్ టీమ్’ అనే పుస్తకంలో ధోని రిటైర్మెంట్ గురించిన ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

Uttar Pradesh: మతం మార్చుకోలేదని భర్త ఘాతుకం.. భార్యపై శారీరక వేధింపులు

‘‘2019 వరల్డ్ కప్ సందర్భంగా న్యూజిలాండ్‌తో జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా ఓడిపోతే ధోని రిటైర్ అవ్వాలనుకున్నాడు. ఈ విషయాన్ని ధోని, రిషబ్ పంత్ కలిసి ఉన్నప్పడు తనతో జరిగిన సంభాషణ ద్వారా తెలిసింది” అని శ్రీధర్ తన పుస్తకంలో రాశాడు. ‘‘మాంచెస్టర్‌‌లో న్యూజిలాండ్‌తో 2019 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ రిజర్వ్‌ డే రోజు ఉదయం ఈ ఘటన జరిగింది. నేనొక్కడినే బ్రేక్ ఫాస్ట్ కోసం వెళ్లాను. తర్వాత ధోని, రిషబ్ పంత్ వచ్చారు. ఆ రోజు న్యూజిలాండ్ తక్కువ ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేయాల్సి ఉంది.

Srinagar Airport: శ్రీనగర్‌‌ ఎయిర్‌‌పోర్టులో భారీగా కురుస్తున్న మంచు.. నిలిచిపోయిన విమానాలు

తర్వాత వెంటనే ఇండియా ఇన్నింగ్స్ ప్రారంభించాలి. ఆ సమయంలో రిషబ్, ధోని మాట్లాడుకున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత కొందరు లండన్‌లో ప్రైవేటుగా ప్రయాణించాలనుకుంటున్నారు, నువ్వూ జాయిన్ అవుతావా అని ధోనీని రిషబ్ పంత్ అడిగాడు. అప్పుడు ధోనీ.. ఇది నా చివరి మ్యాచ్. టీమ్ మేట్స్‌తో కలిసి చేసే చివరి బస్సు ప్రయాణాన్ని ఎలా వదులుకుంటాను అని ధోని అన్నాడు. దీన్ని బట్టి ధోని ఆడే చివరి మ్యాచ్ అదే అని నేను గ్రహించా” అని శ్రీధర్ పేర్కొన్నాడు.