India vs New Zealand: ముగిసిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్.. టీమిండియా టార్గెట్ 161.. మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో న్యూజిలాండ్ 19.4 ఓవర్లలోనే 160 పరుగులు చేసి ఆలౌట్ అయింది. తర్వాత 161 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఉన్నారు.

India vs New Zealand: ముగిసిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్.. టీమిండియా టార్గెట్ 161.. మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా

India vs New Zealand: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 19.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ బ్యాటర్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్ చెరో అర్ధ సెంచరీ సాధించారు.

Bharat Jodo Yatra: రేపటి నుంచి భారత్ జోడో యాత్రలో పాల్గోనున్న ప్రియాంక వాద్రా.. నాలుగు రోజులు సోదరుడి వెంటే..

కాన్వే 49 బంతుల్లో 59 పరుగులు చేయగా, ఫిలిప్స్ 33 బంతుల్లోనే 54 పరుగులు చేశాడు. తర్వాత చంపన్ 12 పరుగులు, డెరిల్ మిచెల్ 10 పరుగులు చేసి ఔటయ్యారు. మిగత బ్యాట్స్‌మెన్ ఎవరూ రెండంకెల స్కోరు కూడా చేయలేదు. దీంతో న్యూజిలాండ్ 19.4 ఓవర్లలోనే 160 పరుగులు చేసి ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో ముగ్గురు డకౌట్ కావడం విశేషం. ఒక దశలో న్యూజిలాండ్ భారీ స్కోరు సాధిస్తుంది అనిపించినప్పటికీ, తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి స్వల్ప స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, సిరాజ్.. చెరో నాలుగు వికెట్లు తీశారు. హర్షల్ పటేల్ ఒక వికెట్ తీశాడు.

తర్వాత 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. 13 పరుగుల వద్ద ఇషాన్ కిషన్ (10) ఔటవ్వగా, రిషబ్ పంత్ కూడా 11 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఉన్నారు.