NZ vs Afg T20: న్యూజిలాండ్ ముందు స్వల్ప లక్ష్యం.. భారత్ ఆశలు గల్లంతేనా?

టీ20 వరల్డ్ కప్‌ 2021లో భాగంగా అఫ్ఘానిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్ఘానిస్తాన్ స్వల్ప స్కోరుకే ఇన్నింగ్స్ ముగించింది.

NZ vs Afg T20: న్యూజిలాండ్ ముందు స్వల్ప లక్ష్యం.. భారత్ ఆశలు గల్లంతేనా?

Nz

NZ vs Afg T20 world cup 2021: టీ20 వరల్డ్ కప్‌ 2021లో భాగంగా అఫ్ఘానిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్ఘానిస్తాన్ స్వల్ప స్కోరుకే ఇన్నింగ్స్ ముగించింది. టీమిండియా సెమీస్ ఆశలు నిలబెట్టే మ్యాచ్‌లో అఫ్ఘానిస్తాన్ పెద్దగా ప్రభావం చూపలేదు.

భారత జట్టు అభిమానులు కివీస్ ఓటమి కోసం ఆశగా ఎదురుచూసినా అటువంటి అవకాశమే లేనట్లుగా కనిపిస్తుంది. అఫ్ఘాన్ జట్టు కేవలం 124పరుగులు మాత్రమే చేసింది. కివీస్ జట్టుకు స్వల్ప లక్ష్యం నిర్దేశించింది.

టీ20 వరల్డ్ కప్‌లో 40వ మ్యాచ్ ఇది కాగా.. ఈ మ్యాచ్‌ అబుదాబీలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్ఘానిస్తాన్ కెప్టెన్ మహ్మద్ నబీ మొదట బ్యాటింగ్ ఎంచుకుని న్యూజిలాండ్‌ని బౌలింగ్‌కి ఆహ్వానించింది. నజీబ్ జద్రాన్ హాఫ్ సెంచరీ(73) చేయడంతో జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 124 పరుగులు చేసింది.

ఓపెనర్లు షెహజాద్‌(4), జజాయ్‌ (2), రహ్మనుల్లా (6) వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. కాసేపు నిలబడిన గుల్బాదిన్‌ నైబ్‌ (15) పెద్దగా పరుగులు చేయలేకపోయారు. ఓపెనర్లు, ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు అవుట్ అవడంతో జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక ఇదే సమయంలో క్రీజ్‌లో ఉన్న నజిబుల్లా జద్రాన్‌ (73)తో ఆదుకున్నాడు. హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు.

అతనికి కాసేపు సహకారం అందించిన కెప్టెన్ మొహమ్మద్ నబీ 20 బంతుల్లో 14 పరుగులు చేశాడు. సౌథీ బౌలింగ్‌లో అతనికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ఆ తర్వాత కాసేపటికే కరీమ్ జనత్‌ (2) అవుటయ్యాడు.

అఫ్ఘాన్ ఇన్నింగ్స్ చివరి బంతికి రషీద్‌ ఖాన్‌ (3) కూడా కివీస్ కెప్టెన్ విలియమ్సన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. నజిబుల్లా జద్రాన్‌ ఒక్కటే మంచి పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఇక నిర్ణిత 20 ఓవర్లలో 124 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్‌లో అఫ్ఘానిస్తాన్ ఓడిపోతే, ఇండియా సెమీస్ ఆశలు గల్లంతయినట్లే.. న్యూజిలాండ్ నేరుగా సెమీస్‌కి వెళ్లిపోతుంది.

న్యూజిలాండ్ Playing XI:
మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్ (సి), డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంత్నర్, ఆడమ్ మిల్నే, టిమ్ సౌథీ, ఇష్ సోధీ, ట్రెంట్ బౌల్ట్.

అఫ్ఘానిస్తాన్ Playing XI
హజ్రతుల్లా జజాయ్, మొహమ్మద్. షాజాద్, రెహ్మానుల్లా గుర్బాజ్, నజీబుల్లా జర్దాన్, గుల్బాదిన్ నాయబ్, మొహమ్మద్. నబీ (కెప్టెన్), కరీం జనత్, రషీద్ ఖాన్, నవీన్-ఉల్-హక్, హమీద్ హసన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్.