India vs New Zealand: తొలి టీ20లో ముగిసిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్.. భారత టార్గెట్ 177
మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఇండియా ముందు 177 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మొదట టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే మంచి ఆరంభాన్నే ఇచ్చారు.

India vs New Zealand: రాంచీ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఇండియా ముందు 177 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మొదట టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది.
దీంతో న్యూజిలాండ్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే మంచి ఆరంభాన్నే ఇచ్చారు. మొదటి నుంచి ధాటిగా ఆడిన ఫిన్ అలెన్ 23 బంతుల్లో 35 పరుగులు చేసి ఔటయ్యాడు. అలెన్ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన మార్క్ చంపన్ నాలుగు బంతులాడి డకౌట్‌గా వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ 22 బంతుల్లో 17 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. మరోవైపు దూకుడుగా ఆడిన డెవాన్ కాన్వే 35 బంతుల్లోనే 52 పరుగులు చేసి నాలుగో వికెట్‌గా ఔటయ్యాడు. కాన్వే ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. తర్వాత వచ్చిన డెరైల్ మిచెల్ మరింత దూకుడుగా ఆడాడు.
Telangana Jobs: తెలంగాణలో మరో జాబ్ నోటిఫికేషన్.. 2391 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి
మిచెల్ 30 బంతుల్లోనే 59 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మిచెల్ 3 ఫోర్లు, 5 సిక్సర్లు కొట్టాడు. తర్వాత వచ్చిన మైకేల్ బ్రేస్‌వెల్ 2 బంతుల్లో ఒకే పరుగు చేసి రనౌట్ అయ్యాడు. తర్వాత వచ్చిన మిచెల్ సాట్నర్ 5 బంతుల్లో ఏడు పరుగులు చేసి ఔటయ్యాడు. మ్యాచ్ ముగిసే సరికి డెరైల్ మిచెల్, ఇష్ సోది నాటౌట్‌గా నిలిచారు. దీంతో న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 176 పరుగులు చేసింది. భాతర బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీయగా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, శివం మావి తలో వికెట్ తీశారు. భారత్ బ్యాటింగ్‌కు సంబంధించి శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ ఓపెనర్లుగా వచ్చారు.