IPL 2019 ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా డేవిడ్ వార్నర్

IPL 2019 ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా డేవిడ్ వార్నర్

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్ 2019 సీజన్‌కు ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచాడు. సుదీర్ఘ విరామం తర్వాత సీజన్‌లోకి అడుగుపెట్టి కొద్ది వారాల పాటు 12 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన వార్నర్ 692 పరుగులు చేశాడు. సీజన్ మొత్తంలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా ఘనత సాధించాడు. 

వరల్డ్ కప్ ప్రిపరేషన్ కోసమని ప్లే ఆఫ్ మ్యాచ్‌లకు ముందే ఐపీఎల్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత వరుసలో 14 మ్యాచ్‌లు ఆడిన కేఎల్ రాహుల్ 593పరుగులతో నిలిచాడు. దీంతో కేఎల్ రాహుల్ మోస్ట్ సైలిష్ ప్లేయర్‌గా హార్దిక్ పాండ్యా చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు. ఆరెంజ్ క్యాప్ అందుకోవడానికి అందుబాటులో లేకపోవడంతో వార్నర్ వీడియో సందేశం ద్వారా తన కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. 

‘ఆరెంజ్ క్యాప్ గెలుచుకోవడం గౌరవదాయకంగా అనిపిస్తుంది. ఆడుతున్నంతసేపు అవార్డుల కోసం ఆలోచించలేదు. కానీ, పిచ్‌ను చక్కగా తయారుచేసినందుకు క్యూరేటర్‌కు థ్యాంక్స్ చెప్పాలి. హైదరబాద్‌లో ఆడటం ఎప్పుడూ సంతోషంగానే భావిస్తాను. ఐపీఎల్‌లో భాగమవడం చాలా గొప్పగా భావిస్తున్నాను’ అని తెలిపాడు. పర్పుల్ క్యాప్ ఇమ్రాన్ తాహిర్‌ను వరించగా, ఫెయర్ ప్లే అవార్డు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు దక్కింది.