PM Narendra Modi: టాస్ వేసేది మోదీనే..? నాల్గో టెస్టును వీక్షించనున్న ఇండియా, ఆస్ట్రేలియా ప్రధానులు.. ఎంతసేపు ఉంటారంటే ..

ఉదయం 8.30 గంటలకు ఇరు దేశాల ప్రధానులు స్టేడియంకు చేరుకోనున్నారు. గంటన్నరపాటు వీరు స్టేడియంలోనే ఉంటారని, ఆటగాళ్లతో ప్రత్యేకంగా భేటీ అవుతారని తెలుస్తోంది. టాస్ వేసే సమయంలో ఇద్దరు ప్రధానులు ఉంటారని, ప్రధాని నరేంద్ర మోదీ టాస్ వేస్తారని సమాచారం.

PM Narendra Modi: టాస్ వేసేది మోదీనే..? నాల్గో టెస్టును వీక్షించనున్న ఇండియా, ఆస్ట్రేలియా ప్రధానులు.. ఎంతసేపు ఉంటారంటే ..

PM Modi

PM Narendra Modi: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య నాల్గో టెస్ట్ మ్యాచ్ గురువారం ప్రారంభమవుతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఉదయం 9 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఇండియా, ఆస్ట్రేలియా చివరి టెస్టు మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని అంటోనీ అల్బనీస్ స్టేడియంకు రానున్నారు. ఇప్పటికే అంటోనీ అల్బనీస్ భారత్‌కు చేరుకున్నారు. 75ఏళ్ల ఇండో – ఆస్ట్రేలియా మైత్రి సంబరాల్లో భాగంగా ఇరు ప్రధానులు స్టేడియంకు రానున్నారు.

IND vs AUS 4th Test Match: డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌‌పై భారత్ గురి.. చివరి టెస్టులో ఆ ఇద్దరు ప్లేయర్లకు చోటు? పిచ్‌ ఎలా ఉంటుందంటే ..

ఉదయం 8.30 గంటలకు ఇరు దేశాల ప్రధానులు స్టేడియంకు చేరుకోనున్నారు. గంటన్నరపాటు వీరు స్టేడియంలోనే ఉంటారని, ఆటగాళ్లతో ప్రత్యేకంగా భేటీ అవుతారని తెలుస్తోంది. టాస్ వేసే సమయంలో ఇద్దరు ప్రధానులు ఉంటారని, ప్రధాని నరేంద్ర మోదీ టాస్ వేస్తారని సమాచారం. ఉదయం 8.30 గంటల నుంచి 10 గంటల వరకు ఇద్దరు ప్రధానులు స్టేడియంలోనే ఉండనున్నారు. ప్రధానులు స్టేడియంకు రానున్న నేపథ్యంలో ఎస్పీజీ భద్రతను కట్టుదిట్టం చేసింది. స్టేడియం భద్రత బాధ్యతను ఎస్పీజీ తన చేతుల్లోకి తీసుకుంది. తొలి రోజు లక్ష మంది మ్యాచ్ ను వీక్షించేందుకు వస్తారని అంచనా. ఇప్పటికే 75 వేల టికెట్లు స్టేడియంలో అమ్ముడయ్యాయి.

IND vs AUS Test Series 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్ చేరాలంటే.. శ్రీలంక జట్టు ఓడాల్సిందేనా..

మ్యాచ్ ప్రారంభానికి ముందు స్టేడియంలో చిన్న వేదికను ఏర్పాటు చేసి ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేదిక పై నుంచి ఇద్దరు ప్రధానులు ఆటగాళ్లనుద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది. ప్రధాని మోదీ మ్యాచ్ ప్రారంభం వ్యాఖ్యానంకూడా చేసే అవకాశాలుఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా మ్యాచ్ కు ముందు ఇరు దేశాల ప్రధానులు బంగారుపూత పూసిన గోల్ఫ్ కారులో స్టేడియంలో తిరిగే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. మొత్తానికి రెండు దేశాల ప్రధానులు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా నాల్గో టెస్టు మ్యాచ్ తొలి రోజు కొద్దిసేపు సందడి చేయనున్నారు.