Dan Christian : నీ భార్యను రేప్ చేస్తాం.. ఆర్సీబీ ప్లేయర్‌కు ఫ్యాన్స్ బెదిరింపులు

కొందరు ఆర్సీబీ అభిమానులు హద్దు మీరి ప్రవర్తించారు. సోషల్ మీడియాలో ఆ జట్టు ఆటగాళ్లపై ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. ఆటగాళ్లతో పాటు వారి భార్యలను బూతులు తిడుతున్నారు.

Dan Christian : నీ భార్యను రేప్ చేస్తాం.. ఆర్సీబీ ప్లేయర్‌కు ఫ్యాన్స్ బెదిరింపులు

Dan Christian

Dan Christian : ఐపీఎల్ 2021లో భాగంగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటంగ్‌ చేసిన ఆర్సీబీ కేవలం 138 పరుగులు చేయగా… 139 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ అవలీలగా ఛేదించింది. దీంతో ఆర్సీబీ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీన్ని ఆర్సీబీ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా, కొందరు ఆర్సీబీ అభిమానులు హద్దు మీరి ప్రవర్తించారు. సోషల్ మీడియాలో ఆ జట్టు ఆటగాళ్లను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఆటగాళ్లతో పాటు వారి భార్యలను బూతులు తిడుతున్నారు. రేప్ చేస్తాం అని బెదిరించారు కూడా.

Lifespan: ఇది తింటే.. మీ జీవితంలో 36నిమిషాలు తగ్గిపోయినట్లే

ఆర్సీబీ ప్లేయర్ డేనియల్ క్రిస్టియన్‌ ను టార్గెట్ చేశారు. అతడి భార్య గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. ఫేక్‌ అకౌంట్లు క్రియేట్‌ చేసి.. ప్రెగ్నెంట్‌ అయిన నీ భార్యను రేప్‌ చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారని క్రిస్టియన్‌ వాపోయాడు. ఈ విషయాన్ని అతడు తన సోషల్ మీడియా పోస్టు ద్వారా తెలిపాడు. క్రికెటర్‌ గా తాను ఫెయిలైతే.. తన ఫ్యామిలీని ఇందులోకి లాగడమేంటని.. క్రిస్టియన్ ఆవేదన వ్యక్తం చేశాడు‌. కాగా.. కోల్ కతాతో మ్యాచ్‌ లో క్రిస్టియన్‌ బౌలింగ్‌ లో సునీల్ నరైన్ 3 సిక్సర్లు బాది.. మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు. మ్యాచ్ ని కోల్ కతా వైపు తిప్పాడు. ఈ నేపథ్యంలోనే ఆర్సీబీ అభిమానులు కొందరు క్రిస్టియన్‌ ను టార్గెట్‌ చేశారు‌.

ఆర్సీబీ ఓటమి తర్వాత తీవ్రమైన బెంగళూరు అభిమానుల విమర్శలతో పాటు బెదిరింపులు ఎదుర్కొంటున్న ఆ జట్టు ఆటగాడు క్రిస్టియన్ కు అండగా ఆ జట్టు యాజమాన్యం నిలిచింది. ‘మేమ 100శాతం క్రిస్టియన్ కు అండగా ఉంటాం. ఆటగాళ్ల పట్ల, ముఖ్యంగా వారి సొంతవారి విషయంలో ఆన్ లైన్ లో జరిగే దూషణలు సహించబోం’ అంటూ ఆర్బీసీ ట్వీట్ చేసింది.

Digestive : తిన్న ఆహారం త్వరగా జీర్ణం కావటం లేదా?..అయితే ఇలా ప్రయత్నించి చూడండి…

దీనిపై గ్లెన్ మ్యాక్స్ వెల్ స్పందించాడు. ట్రోలర్స్ కు, అభ్యంతరకరమైన మెసేజ్ లు పెడుతున్నవారికి ఘాటుగా బదులిచ్చాడు. ‘కొంతమంది సోషల్ మీడియా వేదికగా చెత్త వాగుడు వాగుతున్నారు. ఇది నిజంగా హేయం. మేమూ మనుషులమే. ప్రతిరోజు మా అత్యుత్తమ ఆట కనబరిచేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాం. అసభ్యంగా ప్రవర్తించే బదులు కొంచెం డీసెంట్ గా ఉండేందుకు ట్రై చేయండి’ అంటూ రాసుకొచ్చాడు.

కోల్ కతాతో మ్యాచ్ లో క్రిస్టియన్.. బ్యాటింగ్ లో 8 బంతుల్లో 9 పరుగులు చేసి రనౌట్ కాగా.. బౌలింగ్ లో 1.4 ఓవర్లు వేసి 29 పరుగులు ఇచ్చాడు. అదీగాక.. అతడు వేసిన 12 ఓవర్లో కేకేఆర్ ఆటగాడు నరైన్ ఏకంగా 3 సిక్సర్లు బాదాడు. అప్పటిదాకా కోల్ కతాను కట్టడి చేసిన బెంగళూరు బౌలర్లు.. ఆ ఓవర్ తో ఢీలా పడ్డారు. ఆ ఓవర్ లో 22 పరుగులొచ్చాయి. ఆ ఓవరే తమ విజయావకాశాలను దెబ్బతీసిందని ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా చెప్పుకొచ్చాడు. ”సునీల్ నరైన్ ఆడిన 12 వ ఓవరే మాకు విజయాన్ని దూరం చేసింది. మేం చివరి వరకు బంతితో పోరాడాం. బ్యాటింగ్ లో మరో 20 పరుగులు చేసి ఉంటే మా పరిస్థితి మరో విధంగా ఉండేది. అంతేగాక బౌలింగ్ లో కూడా రెండు, మూడు ఓవర్లలో భారీగా పరుగులిచ్చాం. అదే మా ఓటమికి కారణమైంది’ అని చెప్పుకొచ్చాడు.

Daniel Christian