పంత్.. ఈ జనరేషన్‌ సెహ్వాగ్ లాంటోడు

టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్.. ఈ జనరేషన్ సెహ్వాగ్ లాంటోడు అని సంజయ్ మంజ్రేకర్ ప్రశంసించాడు. పంత్ ఓ విభిన్న శైలిలో ఎటాక్ చేస్తాడని కొనియాడాడు.

పంత్.. ఈ జనరేషన్‌ సెహ్వాగ్ లాంటోడు

టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్.. ఈ జనరేషన్ సెహ్వాగ్ లాంటోడు అని సంజయ్ మంజ్రేకర్ ప్రశంసించాడు. పంత్ ఓ విభిన్న శైలిలో ఎటాక్ చేస్తాడని కొనియాడాడు.

టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్.. ఈ జనరేషన్ సెహ్వాగ్ లాంటోడు అని సంజయ్ మంజ్రేకర్ ప్రశంసించాడు. పంత్ ఓ విభిన్న శైలిలో ఎటాక్ చేస్తాడని కొనియాడాడు. ‘హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్ ప్రదర్శన చూసి గుండె జారినంత పనైంది. రిషబ్ ఈ జనరేషన్ వీరూ లాంటోడు. ఒక్కో బ్యాట్స్‌మన్ ఒక్కోలా ప్రవర్తిస్తాడు. జట్టులోకి ఎంచుకున్నా లేకపోయినా పంత్‌ను మార్చాలని మాత్రం ప్రయత్నించకండి’ అంటూ ట్వీట్ చేశాడు. 

మే8న జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో 21బంతుల్లోనే 49బాదేసి ఢిల్లీని గెలిపించాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ఢిల్లీ నాకౌట్ దశకు చేరుకుంది. ఈ సీజన్లో జరిగిన 15మ్యాచ్‌లలో 450పరుగులు పూర్తి చేశాడు. ఇందులో 3హాఫ్ సెంచరీలు ఉండగా మార్చి 24న ఆడిన ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో 27బంతుల్లోనే 78పరుగులు చేసి అత్యుత్తమ స్కోరు నమోదు చేసుకున్నాడు. 

కాకపోతే దురదృష్టవశాత్తు ప్రపంచ కప్‌కు ఎంపికైన 15మందితో కూడిన జట్టులో పంత్ స్థానం దక్కించుకోలేకపోయాడు. ఇంగ్లాండ్‌లోని వేల్స్ వేదికగా ఆరంభం కానున్న టీంలో దినేశ్ కార్తీక్ సెకండ్ వికెట్ కీపర్‌గా స్థానం దక్కించుకున్నాడు. ఆ తర్వాత స్టాండ్ బై ప్లేయర్ల జాబితాలో పంత్ కూడా చేరినా ఇంగ్లాండ్ వేదికగా ఆడే తుది జట్లలో స్థానం దక్కించుకోవాలనేదే పంత్ ప్రయత్నం.