IND vs PAK Match: సులభమైన క్యాచ్‌ను వదిలేసిన అర్ష్‌దీప్ సింగ్.. ఆగ్రహం వ్యక్తం చేసిన రోహిత్.. హర్భజన్ సింగ్ రియాక్షన్ ..!

ఆసియా కప్ టోర్నీలో భాగంగా సూపర్-4 పోరులో భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య ఆదివారం రసవత్తర మ్యాచ్ జరిగింది. చివరి వరకు పోరాడిన భారత్ జట్టు పాక్ విజయాన్ని అడ్డుకోలేక పోయింది. చివరి ఓవర్లలో సులభమైన క్యాచ్ ను అర్ష్ దీప్ సింగ్ వదిలేయడంతో రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

IND vs PAK Match: సులభమైన క్యాచ్‌ను వదిలేసిన అర్ష్‌దీప్ సింగ్.. ఆగ్రహం వ్యక్తం చేసిన రోహిత్.. హర్భజన్ సింగ్ రియాక్షన్ ..!

rohit sharma

IND vs PAK Match: ఆసియా కప్ టోర్నీలో భాగంగా సూపర్-4 పోరులో భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య ఆదివారం రసవత్తర మ్యాచ్ జరిగింది. చివరి వరకు పోరాడిన భారత్ జట్టు పాక్ విజయాన్ని అడ్డుకోలేక పోయింది. చివరి ఓవర్లో భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని పాక్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి సాధించింది. ఈ మ్యాచ్ లో భారత్ ఆటగాళ్లు చేసిన పలు తప్పిదాలతో మ్యాచ్ చేజారిందని మాజీ క్రికెట్లు పేర్కొంటున్నారు. ముఖ్యంగా అర్ష్‌దీప్ సింగ్ పాక్ బ్యాటర్ అసిఫ్ అలీ క్యాచ్‌ను వదిలేడం పాకిస్థాన్ జట్టు విజయానికి దోహదం చేసిందని మాజీలు పేర్కొంటున్నారు.

Ind VS Pak : ఆసియా కప్.. ఉత్కంఠపోరులో భారత్‌పై పాకిస్తాన్ విజయం

మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతున్న క్రమంలో 18వ ఓవర్‌ను రవి బిష్ణోయ్ కొనసాగించాడు. క్రీజులో ఖుష్దిల్ షా, ఆసిఫ్ అలీలు ఉన్నారు. పాక్ ఇంకా30 పరుగుల వరకు చేయాల్సి ఉంది. అప్పటి వరకు భారత్ కే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆసిఫ్ దాటిగా ఆడాడు.  రవి బిష్ణోయ్ మూడో బంతి డెలివరీ చేయగా.. ఆసిఫ్ స్వీప్ షాట్ ఆడాడు బంతి గాల్లోకి ఎగిరి అర్ష్ దీప్ సింగ్ వద్దకు వెళ్లింది. బాల్ సులువుగా చేతిలోకి చేరుతున్న క్రమంలో అర్ష్ దీప్ క్యాచ్ ను మిస్ చేశాడు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. అతని కోపాన్ని అదుపుచేసుకోలేక అర్ష్ దీప్ సింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అర్ష్‌దీప్ సింగ్ క్యాచ్ మిస్ చేయడంతో పలువురి నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ట్వీట్ చేశారు. ఎవరూ ఉద్దేశపూర్వకంగా క్యాచ్ ను వదలరు. భారత్ యంగ్ క్రీడాకారులను చూసి మేము గర్విస్తున్నాం. పాకిస్థాన్ మెరుగ్గా ఆడింది. ఈ వేదిక పై చౌకబారు మాటలు చేసి మన వాళ్లను తలదించుకేలా చేయొద్దు. జట్టు, అర్ష్ ఈజ్ గోల్డ్ అంటూ హర్భజన్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ లో అర్ష్‌దీప్ సింగ్‌కు హర్భజన్ మద్దతుగా నిలిచాడు. దీంతో పలువురు హర్భజన్ ట్వీట్ కు మద్దతు తెలుపుతూ రీ ట్వీట్లు చేస్తున్నారు.