IPL-2023: Are You Ready అంటూ ఐపీఎల్ జట్ల కెప్టెన్ల ఫొటో.. వారిలో ఒక కెప్టెన్ మిస్సింగ్

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఫొటోలో లేడు. దీంతో ఐపీఎల్ అన్ని సీజన్లలోకెళ్లా మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ ఎక్కడా? అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

IPL-2023: Are You Ready అంటూ ఐపీఎల్ జట్ల కెప్టెన్ల ఫొటో.. వారిలో ఒక కెప్టెన్ మిస్సింగ్

IPL-2023

IPL-2023: అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL-2023) మ్యాచులు మార్చి 31 నుంచి ప్రారంభం అవుతున్న వేళ… ఇవాళ ఆయా జట్ల కెప్టెన్లు ఫొటో సెషన్ లో పాల్గొన్నారు. Are You Ready అంటూ ఐపీఎల్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఐపీఎల్ మ్యాచులు దేశ వ్యాప్తంగా 12 పట్టణాల్లో, 10 టీమ్స్ మధ్య జరుగుతాయి. మొత్తం 70 లీగ్ మ్యాచులు నిర్వహిస్తారు.

IPL-2023


IPL-2023

ఇవాళ ఐపీఎల్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫొటోలో 10 మంది కెప్టెన్లు కాకుండా 9 మంది కెప్టెన్లు మాత్రమే కనపడుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ నితీశ్ రాణా, లఖ్ నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ డు ప్లెసిస్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ మార్క్రామ్ ఉన్నారు.

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఫొటోలో లేడు. దీంతో ఐపీఎల్ అన్ని సీజన్లలోకెళ్లా మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ ఎక్కడా? అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. రోహిత్ శర్మ ఈ ఫొటో షూట్ లో ఎందుకు పాల్గొనలేదని చాలా మంది అడుగుతున్నారు. కాగా, మే 28 వరకు ఈ సీజన్ ఐపీఎల్ జరగనుంది.

మార్చి 31న అహ్మదాబాద్ లో మోతెరా స్టేడియంలో తొలి మ్యాచు గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతుంది. గత సీజన్ లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ గెలుపొందిన విషయం తెలిసిందే. ఐపీఎల్ సీజన్ ప్రారంభమవుతున్న సందర్భంగా బయటకు వస్తున్న ఆటగాళ్ల వీడియోలు, ఫొటోలు అలరిస్తున్నాయి.


IPL 2023: గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమైన ఐదుగురు కీలక ఆటగాళ్లు వీరే..