భార్యతో కలిసి భళే వర్కౌట్స్ చేస్తున్న రోహిత్ శర్మ

10TV Telugu News

టీమిండియాలో ఫిట్‌నెస్ కపుల్స్ అంటే విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ. ఇదే బాటలోకి వచ్చేశారు టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్‌ శర్మ.. భార్య రితికాతో కలిసి వర్క్‌అవుట్స్‌ చేస్తున్న ఒక వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. దీనిపై రోహిత్‌ శర్మ టీమ్ మేట్ యుజ్వేంద్ర చాహల్‌ ఎప్పటిలాగే ఫన్నీగా కౌంటర్ వేశారు.

యజువేంద్ర చాహల్‌ మాత్రం ఈ వీడియోపై చాలా ఫన్నీగా స్పందించారు. ఏంటి వదినా, భయ్యా నీతో కలిసి ఐపీఎల్‌ ఓపెనింగ్‌ ఆడుతున్నాడా? అని కామెంట్‌ చేశారు. మొన్న దుబాయ్‌ వెళుతున్న సమయంలో తన కూతురు వస్తువులు ప్యాక్‌ చేయడంలో సాయం చేస్తున్న వీడియోనూ రోహిత్ షేర్‌ చేశాడు. దుబాయ్ వెళ్లడానికి చీఫ్ సాయం చేస్తుంది థ్యాంక్స్ బాబా అని పేర్కొన్నాడు.

ఇప్పుడు తన భార్య రితికాతో వర్కౌట్స్ చేస్తున్న పోస్టును పంచుకున్నాడు. దీనికి ‘స్ట్రాంగర్ టూ గెదర్’ అనే క్యాప్షన్‌కి తోడు దానికి ఒక బ్లూకలర్‌ హార్ట్ ఎమోజీని జోడించాడు. దీనిపై అభిమానులు స్పందిస్తున్నారు. కపుల్‌ గోల్స్‌ యట్‌ పీక్స్‌ అంటూ కొందరు కామెంట్‌ చేశారు.

 

View this post on Instagram

 

Stronger together 💙

A post shared by Rohit Sharma (@rohitsharma45) on