Snake In Cricket Ground : భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌లో ఒక్కసారిగా కలకలం.. గ్రౌండ్‌లోకి అనుకోని అతిథి.. హడలిపోయిన క్రికెటర్లు

గౌహతి వేదికగా సౌతాఫ్రికా, భారత్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. మ్యాచ్ జరుగుతున్న గ్రౌండ్ లోకి అనుకోని అతిథి వచ్చింది. అంతే.. ఒక్కసారిగా అలజడి రేగింది.

Snake In Cricket Ground : భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌లో ఒక్కసారిగా కలకలం.. గ్రౌండ్‌లోకి అనుకోని అతిథి.. హడలిపోయిన క్రికెటర్లు

Snake In Cricket Ground : గౌహతి వేదికగా సౌతాఫ్రికా, భారత్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. మ్యాచ్ జరుగుతున్న గ్రౌండ్ లోకి అనుకోని అతిథి వచ్చింది. అంతే.. ఒక్కసారిగా అలజడి రేగింది. దాన్ని చూసి మైదానంలోని క్రికెటర్లు హడలిపోయారు. భయంతో వణికిపోయారు. ఇంతకీ ఆ గెస్ట్ ఎవరో తెలుసా? పాము.. అవును.. క్రికెట్ గ్రౌండ్ లోకి పాము వచ్చింది.

Snake In Cricket Ground

భారత ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ చేస్తున్నారు. 7వ ఓవర్ పూర్తయింది. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ, ఒక్కసారిగా పాము గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. పాముని చూసి క్రికెటర్లు హడలిపోయారు. దీంతో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. రంగంలోకి దిగిన గ్రౌండ్ సిబ్బంది పామును పట్టుకుని తీసుకెళ్లాక మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

క్రికెట్ గ్రౌండ్ లో పాము కలకలం..

ఈ మ్యాచ్ లో భారత్ దంచికొట్టింది. భారత బ్యాటర్లు పరుగుల వరద పారించారు. టాపార్డర్ బ్యాట్స్ మెన్ వీరవిహారం చేశారు. సౌతాఫ్రికా బౌలర్లను చీల్చి చెండాడారు. ఓపెనర్ కేఎల్ రాహుల్ నుంచి దినేశ్ కార్తీక్ వరకు బౌండరీల వర్షం కురిపించారు. ముఖ్యంగా ‘మిస్టర్ 360’ సూర్యకుమార్ యాదవ్ సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 237 పరుగుల భారీ స్కోరు చేసింది. కేఎల్ రాహుల్, కెప్టెన్ రోహిత్ శర్మ తొలి వికెట్ కు 96 పరుగులు జోడించి అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. రాహుల్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్ లతో 57 పరుగులు చేయగా.. రోహిత్ శర్మ 37 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ తో 43 పరుగులు చేశారు.

ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ చిచ్చరపిడుగులా చెలరేగిపోయాడు. సఫారీ బౌలింగ్ ను ఊచకోత కోస్తూ కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. మొత్తం 22 బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్ యాదవ్ 61 పరుగులు చేసి రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. అతడి స్కోర్ లో 5 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి.