ICC Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు పాకిస్తాన్ వెళ్లడంపై భారత క్రీడా మంత్రి

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మంగళవారం పదేళ్లకు సరిపడ మెగా ఈవెంట్ల ప్లానింగ్ చెప్పేసింది. అందులో పాకిస్తాన్ వేదికగా 2025లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ హైలెట్ గా నిలిచింది.

ICC Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు పాకిస్తాన్ వెళ్లడంపై భారత క్రీడా మంత్రి

Icc Champions Trophy

ICC Champions Trophy: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మంగళవారం పదేళ్లకు సరిపడ మెగా ఈవెంట్ల ప్లానింగ్ చెప్పేసింది. అందులో పాకిస్తాన్ వేదికగా 2025లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ హైలెట్ గా నిలిచింది. దీనిపై భారత క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రెస్పాండ్ అయ్యారు. టోర్నమెంట్ సందర్భంగా ఇండియా.. పాకిస్తాన్ కు వెళ్లడానికి రెడీగా లేదని అన్నారు.

రాజకీయ ఒత్తిళ్ల కారణంగా.. ఇండియా, పాకిస్తాన్ ల మధ్య ఐసీసీ ఈవెంట్స్ మాత్రమే జరుగుతున్నాయి. చాలాకాలంగానే టీమిండియా పాకిస్తాన్ కు వెళ్లి ఆడటం మానేసింది. ఈ నిర్ణయం హోం మంత్రి తీసుకోవాల్సి ఉంటుందని.. కొన్ని చర్చల తర్వాతే నిర్ణయం ప్రకటిస్తామని అన్నారు.

‘సమయం వచ్చినప్పుడు చూద్దాం. హోం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకోవడంలో భాగమై ఉంది. చాలా దేశాలు సెక్యూరిటీ కారణాల రీత్యా పాకిస్తాన్ కు వెళ్లకుండా ఆగిపోతున్నాయి. ముందు సెక్యూరిటీ ఆలోచించి ఆ తర్వాత నిర్ణయిస్తాం’ అని ఠాకూర్ అన్నారు.

……………………………………….: ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా సౌరవ్ గంగూలీ