India vs Eng : లార్డ్స్‌ ఛాలెంజ్‌కు టీమిండియా రెడీ

ఇండియా - ఇంగ్లండ్‌ల మధ్య రెండో టెస్టు ప్రారంభంకానుంది. 2021, ఆగస్టు 12వ తేదీ గురువారం మధ్యాహ్నం 3గంటల 30 నిమిషాలకు లార్డ్స్‌ వేదికగా మ్యాచ్‌ మొదలు కానుంది. విజయంతో సిరీస్‌ను స్టార్ట్‌ చేద్దామనుకున్న విరాట్‌ టీమ్‌ అశలకు తొలి టెస్టులో వరుణుడు బ్రేక్‌ వేసిన సంగతి తెలిసిందే.

India vs Eng : లార్డ్స్‌ ఛాలెంజ్‌కు టీమిండియా రెడీ

Bcci

India vs England 2nd Test : ఇండియా – ఇంగ్లండ్‌ల మధ్య రెండో టెస్టు ప్రారంభంకానుంది. 2021, ఆగస్టు 12వ తేదీ గురువారం మధ్యాహ్నం 3గంటల 30 నిమిషాలకు లార్డ్స్‌ వేదికగా మ్యాచ్‌ మొదలు కానుంది. విజయంతో సిరీస్‌ను స్టార్ట్‌ చేద్దామనుకున్న విరాట్‌ టీమ్‌ అశలకు తొలి టెస్టులో వరుణుడు బ్రేక్‌ వేసిన సంగతి తెలిసిందే. మొదటి టెస్ట్‌ చివరి రోజు వర్షంతో తుడిచిపెట్టుకుపోవడంతో ఆ టెస్టు డ్రాగా ముగిసింది.

Read More : Adipurush: ప్రభాస్ పక్కా ప్లాన్.. ఆదిపురుష్ డేట్ ఫిక్స్!

ఇక గురువారం జరిగే మ్యాచ్‌లో నలుగురు పేసర్లు, ఓ స్పిన్నర్‌ ఫార్ములానే టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు బ్యాటింగ్‌లో ఇండియన్‌ బ్యాట్స్‌మెన్‌ ఆశించిన స్థాయిలో ఆడడం లేదు. విఫలమౌతుండడంతో భారత అభిమానులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఓపెనర్‌ రోహిత్ భారీ స్కోర్‌ చేయాలని ఆశిస్తున్నారు. తొలి టెస్టులో కోహ్లీ గోల్డెన్ డక్‌తో తీవ్రంగా నిరాశపరిచాడు. ఇక చతేశ్వర్ పుజారా తన వైఫల్యాన్ని కొనసాగిస్తుండగా.. అజింక్య రహానే తడబడుతున్నాడు. రిషభ్ పంత్ కూడా ఆకట్టుకోలేకపోతుండడం ఆందోళన కలిగిస్తోంది.

Read More : Twitter : అందుకే రాహుల్ ట్విట్టర్ అకౌంట్ లాక్

ఇక ఏకైక స్పిన్నర్‌గా బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన రవీంద్ర జడేజాకే మరోసారి అవకాశం దక్కనుంది. ఫస్ట్ టెస్ట్‌లో జడేజా బౌలర్‌గా రాణించకపోయినా.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు. దీంతో స్పెషలిస్ట్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ మరోసారి బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. పేసర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్‌కు అవకాశం దక్కనుంది. ఈ నలుగురు ఫస్ట్‌ టెస్ట్‌లో దుమ్ములేపారు. అయితే శార్దూల్‌ పిక్క కండరాల గాయంతో బాధపడుతున్నాడు. ఒకవేళ అతడు ఆడలేని పరిస్థితిలో ఉంటే సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ రెండో టెస్ట్ ఆడనున్నాడు. మరి భారత్ క్రీడాకారులు ఎలాంటి పోరాటం చేస్తారో చూడాలి.