Vice-Captain: భారత జట్టు వైస్ కెప్టెన్‌గా అతనికే అవకాశం.. త్వరలో ప్రకటన!

భారత వన్డే(ODI) జట్టుకు కొత్త కెప్టెన్‌గా రోహిత్ శర్మను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) నియమించింది.

Vice-Captain: భారత జట్టు వైస్ కెప్టెన్‌గా అతనికే అవకాశం.. త్వరలో ప్రకటన!

Kl Rahul

Vice-Captain: భారత వన్డే(ODI) జట్టుకు కొత్త కెప్టెన్‌గా రోహిత్ శర్మను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) నియమించింది. అంతకుముందు టీ20 ఇంటర్నేషనల్‌లో విరాట్ కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత రోహిత్‌కి టీ20 జట్టు కమాండ్‌ని అప్పగించింది. ఇప్పుడు బీసీసీఐ త్వరలో వన్డే జట్టుకు కొత్త వైస్‌కెప్టెన్‌ను ప్రకటించబోతుంది.

వన్డే జట్టుకు వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్:
భారత వన్డే జట్టుకు కేఎల్ రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా చేయగలరని చెబుతున్నారు. ప్రస్తుతం టీ20 ఫార్మాట్‌లో జాతీయ జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు కేఎల్ రాహుల్. ఇప్పుడు వన్డే ఫార్మాట్‌లో కూడా అతనికే బాధ్యతలను అప్పగించాలని భావిస్తోంది బీసీసీఐ.

భారత టీ20 కెప్టెన్‌గా కొనసాగేందుకు విరాట్ కోహ్లి నిరాకరించడంతో.. వన్డే జట్టుకు కూడా రోహిత్ శర్మకు కెప్టెన్సీ అప్పగించాలని సెలక్టర్లు నిర్ణయించుకున్నారని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించారు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో జట్టుకు ఇద్దరు వేర్వేరు కెప్టెన్లు ఉండడం కుదరదు అని గంగూలీ అభిప్రాయపడ్డారు.