Tokyo Olympics – PV Sindhu: రియో సిల్వర్ మెడల్ కంటే టోక్యో కాంస్యమే గొప్ప – పీవీ సింధు

ఒలింపిక్స్‌ టోర్నీలో ఇండియాకు మరో పతకం తెచ్చిపెట్టిన పీవీ సింధుకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. స్వర్ణం వస్తుందని భావిస్తే ఒక్క గేమ్‌తో దశ మారిపోయింది. 2016రియో ఒలింపిక్స్‌లో స్వర్ణాన్ని త్రుటిలో చేజార్చుకున్న సింధు.. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో రెండు గేమ్ ల ముందే గోల్డ్ చేజారింది.

Tokyo Olympics – PV Sindhu: రియో సిల్వర్ మెడల్ కంటే టోక్యో కాంస్యమే గొప్ప – పీవీ సింధు

pV Sindhu

Tokyo Olympics – PV Sindhu: ఒలింపిక్స్‌ టోర్నీలో ఇండియాకు మరో పతకం తెచ్చిపెట్టిన పీవీ సింధుకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. స్వర్ణం వస్తుందని భావిస్తే ఒక్క గేమ్‌తో దశ మారిపోయింది. 2016రియో ఒలింపిక్స్‌లో స్వర్ణాన్ని త్రుటిలో చేజార్చుకున్న సింధు.. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో రెండు గేమ్ ల ముందే గోల్డ్ చేజారింది. తన చివరి మ్యాచ్ ను విజయంతో ముగించి కాంస్యం సొంతం చేసుకున్నారు సింధు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. ఆ సిల్వర్ కంటే ఈ కాంస్యమే గొప్ప అని చెబుతున్నారు. శనివారం తై జుతో పరాజయం తర్వాత సెమీస్ వైఫల్యం భావోద్వేగానికి గురి చేసిందని.. ఎమోషన్స్ బయటపడనీయకుండా ఆడి గెలవడంతో కాంస్యం సాధించానని చెప్పారు. 2016 రియో ఒలింపిక్స్ లో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగడంతో స్వేచ్ఛగా ఆడగలిగానని.. 2020 టోక్యో ఒలింపిక్స్ లో ఫేవరేట్ గా ఉండటంతో భారీ అంచనాలతో ఆడాల్సి వచ్చిందని అన్నారు.

‘మెడల్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఏళ్లతరబడి పడుతున్న కఠోర శ్రమ ఫలితమే ఇది. ఫైనల్ అవకాశం చేజార్చుకున్నాక నాలో బోలెడు భావోద్వేగాలు చెలరేగాయి. కాంస్యం గెలిచినందుకు సంతోషించాలా? లేదంటే ఫైనల్‌లో ఆడే అవకాశాన్ని కోల్పోయినందుకు బాధపడాలా? నా ఎమోషన్స్ ను కట్టిపెట్టి అత్యుత్తమమైన ఆటతీరు కనబరిచా. నిజంగా చాలా ఆనందంగా ఉంది. చాలా బాగా ఆడా. దేశానికి పతకం అందించినందుకు గర్వంగా ఉంది’ అని సింధు పేర్కొంది.

బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో 26 ఏళ్ల సింధు రెండు వ్యక్తిగత పతకాలు సాధించి ఈ ఫీట్ సాధించిన నాలుగో క్రీడాకారిణిగా నిలిచారు.