T20 World Cup-2022: ప్రపంచ రికార్డుకు 28 పరుగుల దూరంలో కోహ్లీ.. నేటితో పూర్తి చేస్తాడా?

ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్ మ్యాచుల్లో అదరగొడుతున్న టీమిండియా బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ మరో 28 పరుగులు చేస్తే ఓ రికార్డును బద్దలు కొడతాడు. ఇప్పటివరకు జరిగిన ప్రపంచ కప్ టోర్నమెంట్లన్నింటిలో కలిపి శ్రీలంక మాజీ సారథి జయవర్ధనే 1,016 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 989 పరుగులు చేశాడు. నేడు భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న మ్యాచులో కోహ్లీ 28 పరుగులు చేస్తే జయవర్ధనే రికార్డును బద్దలు కొట్టొచ్చు.

T20 World Cup-2022: ప్రపంచ రికార్డుకు 28 పరుగుల దూరంలో కోహ్లీ.. నేటితో పూర్తి చేస్తాడా?

T20 World Cup-2022: ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్ మ్యాచుల్లో అదరగొడుతున్న టీమిండియా బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ మరో 28 పరుగులు చేస్తే ఓ రికార్డును బద్దలు కొడతాడు. ఇప్పటివరకు జరిగిన ప్రపంచ కప్ టోర్నమెంట్లన్నింటిలో కలిపి శ్రీలంక మాజీ సారథి జయవర్ధనే 1,016 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 989 పరుగులు చేశాడు. నేడు భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న మ్యాచులో కోహ్లీ 28 పరుగులు చేస్తే జయవర్ధనే రికార్డును బద్దలు కొట్టొచ్చు.

అన్ని టీ20 ప్రపంచ కప్ లలో కలిపి అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా నిలవచ్చు. నేటి మ్యాచులో 11 పరుగులు చేస్తే 1,000 పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్ గా కోహ్లీ నిలుస్తాడు. ఇప్పటివరకు జయవర్ధనే మాత్రమే 1,000 పరుగులు చేశాడు. అన్ని ప్రపంచ కప్ లలో కలిపి కోహ్లీ ఇప్పటివరకు 23 మ్యాచులు ఆడి 989 పరుగులు చేశాడు.

అతడి యావరేజ్ 89.9 గా ఉంది. మొత్తం 12 అర్ధ సెంచరీలు బాదాడు. ఆస్ట్రేలియాలో జరుగుతోన్న టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా ఆడిన మొదటి రెండు మ్యాచుల్లోనూ కోహ్లీ అర్ధసెంచరీలు కొట్టి టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. నేటి మ్యాచ్ లోనూ అతడి ప్రదర్శనపై అంచనాలు భారీగా ఉన్నాయి.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..