Virat Kohli Pathaan Dance: విరాట్ కోహ్లి పఠాన్ డ్యాన్స్.. జడేజా కూడా జతకలిశాడు.. భలే చేశారే

Virat Kohli Pathaan Dance: ఆస్ట్రేలియాతో మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లి మైదానంలో జూమ్ జో పఠాన్ పాటకు స్టెప్పులు వేశాడు. అతడికి రవీంద్ర జడేజా కూడా జత కలవడంతో సందడి వాతావరణం నెలకొంది.

Virat Kohli Pathaan Dance: విరాట్ కోహ్లి పఠాన్ డ్యాన్స్.. జడేజా కూడా జతకలిశాడు.. భలే చేశారే

Updated On : February 11, 2023 / 4:30 PM IST

Virat Kohli Pathaan Dance:  నాగపూర్ టెస్టులో భారీ విజయంతో టీమిండియా ఆటగాళ్లు జోష్ తో ఉన్నారు. ఆస్ట్రేలియా లాంటి పటిష్టమైన జట్టును మూడు రోజుల్లోనే మట్టి కరిపించి ఇన్నింగ్స్ తేడాతో ఓడించడంతో భారత ఆటగాళ్లు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. అటు బాలీవుడ్ లో చాలా రోజుల తర్వాత పఠాన్ సినిమాతో హిట్ కొట్టారు షారూఖ్ ఖాన్. ఈ సినిమాలోని జూమ్ జో పఠాన్ పాటకు షారూఖ్, దీపికా పదుకునే వేసిన స్టెప్పులు బాగా ఫేమస్ అయ్యాయి. ఈ స్పెప్టులను అనుకరిస్తూ చేసిన వీడియోలను చాలా మంది సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. తాజాగా టీమిండియా ఆటగాళ్లు కూడా పఠాన్ పాటకు పాదం కలిపారు.

ఆస్ట్రేలియాతో మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లి మైదానంలో జూమ్ జో పఠాన్ పాటకు స్టెప్పులు వేశాడు. అతడికి రవీంద్ర జడేజా కూడా జత కలవడంతో సందడి వాతావరణం నెలకొంది. వీరిద్దరూ డాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, ఈ మ్యాచ్ లో అద్భుతంగా ఆడిన జడేజా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. జట్టు విజయంతో ఆనందోత్సాహల్లో మునిగి తేలుతున్న జడేజాకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఊహించని షాక్ ఇచ్చింది. అంపైర్ల అనుమతి లేకుండా తన చేతి వేళ్లకు క్రీమ్ వాడినందుకు అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించింది.

Also Read: వామ్మో ఏం బౌలింగ్.. ఆస్ట్రేలియా భయపడినట్టుగానే.. మామూలుగా తిప్పలేదుగా..

సోషల్ మీడియాలో సందడి
ఆస్ట్రేలియాపై టీమిండియా విజయంతో సోషల్ మీడియాలో సందడి నెలకొంది. రోహిత్ సేనను మెచ్చుకుంటూ సందేశాలు పోస్ట్ చేస్తున్నారు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, రోహిత్ శర్మలపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లను మీమ్స్ తో ట్రోల్ చేస్తున్నారు. ఫొటోలు, వీడియోలతో సెటైర్లు వేస్తున్నారు.