TATA IPL: వీవో ఐపీఎల్ బదులు టాటా ఐపీఎల్‌గా పేరు మార్పు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్పాన్సర్‌షిప్ మారారు. ఈ మెగా టోర్నీకి కొత్త స్పాన్సర్ టాటా రావడంతో 2022 ఐపీఎల్ టైటిల్ ముందు టాటా ఐపీఎల్ గా మారనుంది.

TATA IPL: వీవో ఐపీఎల్ బదులు టాటా ఐపీఎల్‌గా పేరు మార్పు

Ipl Title

TATA IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్పాన్సర్‌షిప్ మారారు. ఈ మెగా టోర్నీకి కొత్త స్పాన్సర్ టాటా రావడంతో 2022 ఐపీఎల్ టైటిల్ ముందు టాటా ఐపీఎల్ గా మారనుంది. దీంతో 2016లో స్టార్ట్ అయిన వీవో ఐపీఎల్ మరోసారి మెగా టోర్నీ స్పాన్సర్ షిప్ కు దూరం కానుంది. 2020లో మాత్రమే Dream 11 స్పాన్సర్ కాగా Vivo చివరి సారిగా 439.8కోట్ల రూపాయలకు దక్కించుకుంది.

దీనిపై రెస్పాండ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్ మంగళవారం స్పాన్సర్ షిప్ విషయాన్ని కన్ఫమ్ చేశారు. ‘అవును టైటిల్ స్పాన్సర్ గా Vivo స్థానాన్ని TATA భర్తీ చేయనుందని’ అన్నారు పటేల్. స్పాన్సర్‌షిప్ డీల్‌లో వీవోకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఈ సమయంలో మెయిన్ స్పాన్సర్ గా టాటానే ఉండబోతుంది.

2018లో తిరిగి స్పాన్సర్‌షిప్ దక్కించుకున్న వీవో.. మొత్తం డీల్ ధర రూ.2వేల 200కోట్లు. 2020 గాల్వాన్ లోయలో ఇండియా, చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణల తర్వాత ఆ ఏడాది స్పాన్సర్ గా డ్రీమ్ 11కు అవకాశం ఇచ్చారు. ఏడాది విరామం తర్వాత తిరిగి వీవోనే ఐపీఎల్ స్పాన్సర్ అయినా ఆ హక్కులను ఇతర సంస్థలకు అప్పగించాలని భావించింది బీసీసీఐ.

ఇది కూడా చదవండి : ఆ పండ్లు శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించేస్తాయ్….

ఐపీఎల్ లో ఈ ఏడాది రెండు కొత్త టీంలు చేరనున్నాయి. అహ్మదాబాద్ జట్టు, లక్నో జట్లను చేర్చుకోవడానికి బీసీసీఐ ఫార్మల్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది. ఐపీఎల్ మెగా వేలం జరగడానికి ముందే ప్రధాన ఏర్పాట్లన్నింటినీ జట్టు పూర్తి చేసుకుంటున్నాయి.