Team India : కోహ్లీ స్థానంలో ఎవరు ? కోన్ బనేగా టెస్టు కెప్టెన్.. బీసీసీఐకి కొత్త సవాల్

ఇప్పుడు కోహ్లీ స్థానంలో ఎవరు అన్న ప్రశ్న మొదలైంది. రోహిత్ శర్మ వన్డే, టీ20 జట్ల కమాండ్‌ని తీసుకున్నాడు. టెస్టు జట్టుకు కూడా రోహితే కెప్టెన్ అవుతాడా? లేకపోతే...

Team India : కోహ్లీ స్థానంలో ఎవరు ? కోన్ బనేగా టెస్టు కెప్టెన్.. బీసీసీఐకి కొత్త సవాల్

Test

India’s Next Test Captain : భారత క్రికెట్‌లో ఓ శకం ముగిసింది. ఏడేళ్లుగా జట్టును ముందుకు నడిపించి విదేశాల్లోనూ గెలుపు రుచిని చూపిన కోహ్లీ కెప్టెన్‌గా బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. జట్టులో ఆటగాడిగా మాత్రమే కొనసాగనున్నాడు. ఇంతకుముందే వన్డే, టీ20 కెప్టెన్సీ తప్పుకున్న కోహ్లీ… ఇంత హఠాత్తుగా టెస్టుల నుంచి కూడా సారధ్య బాధ్యతలు వదులుకుంటాడని ఎవరూ ఊహించలేదు. దీంతో ఇప్పుడు కోహ్లీ స్థానంలో ఎవరు అన్న ప్రశ్న మొదలైంది. రోహిత్ శర్మ వన్డే, టీ20 జట్ల కమాండ్‌ని తీసుకున్నాడు. టెస్టు జట్టుకు కూడా రోహితే కెప్టెన్ అవుతాడా? లేకపోతే రాహుల్‌కు ఛాన్స్‌ ఇస్తారా..? లేకపోతే యంగ్‌స్టర్‌ రిషబ్‌ పంత్‌కు అవకాశమిస్తారా..? అన్నదానిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. పంత్ యువకుడు కావడంతో భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని అతనికే కెప్టెన్సీ అప్పగించాలని సునీల్‌ గవాస్కర్‌ లాంటి మాజీలు కోరుతున్నారని సమాచారం. అటు జస్ప్రిత్​ బుమ్రాకు కూడా టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read More : Salman Khan : పరువు నష్టం దావా వేసిన సల్మాన్..ఎవరి మీదో తెలుసా ?

కేఎల్ రాహుల్ : –
కోహ్లీ కెప్టెన్సీ రాజీనామాతో టీమిండియా తదుపరి టెస్ట్ కెప్టెన్‌ గురించే చర్చ నడుస్తుండగా.. ఎక్కువ మంది కేఎల్ రాహుల్‌ వైపే చూపిస్తున్నారు. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టుకు గాయం కారణంగా కోహ్లీ దూరమవగా.. రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించాడు. దీంతో అతడికే పూర్తి స్థాయి బాధ్యతలు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే రాహుల్ వయస్సు ప్రస్తుతం 29 సంవత్సరాలు. టెస్ట్ క్రికెట్‌లో రాహుల్ బ్యాట్ పరుగులు వరద పారిస్తోంది. అతనిలో చాలా క్రికెట్ మిగిలి ఉంది. అయితే ఐపీఎల్‌లో మోస్ట్ ఫెయిల్యూర్‌ కెప్టెన్లలో ఒకడిగా రాహుల్‌ ఇప్పటికే అప్రతిష్టత మూటగట్టుకుని ఉన్నాడు.

Read More : The Godfather : మాస్టర్ పీస్ మళ్ళీ వస్తోంది..

రోహిత్ శర్మ : –
ఇక కలర్‌ ఫార్మట్‌లలో గొప్ప నాయకుడిగా పేరున్న రోహిత్‌ శర్మకి కూడా టెస్టు కెప్టెన్సీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించిన తర్వాత.. రోహిత్ శర్మకు పూర్తి స్థాయి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. ఇప్పుడు టెస్టు కెప్టెన్సీకీ రోహిత్‌ను బీసీసీఐ ఎంపిక చేసే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తముతున్నాయి. ఇప్పటికే టెస్టు టీమ్​ వైస్‌ కెప్టెన్‌గా రోహిత్ శర్మ కొనసాగుతున్నాడు. అయితే రోహిత్‌ పూర్తిస్థాయి టెస్టు ఆటగాడు కాకపోవడం అతడికి మైనస్‌… అటు వయసు ప్రభావం కూడా రోహిత్‌కు మైనస్‌ కానుంది. ప్రస్తుతం అతనికి 34ఏళ్లు. తరచుగా ఫిట్‌నెస్‌ సమస్యలు ఎదుర్కొంటున్నాడు.

Read More : Salman Khan : పరువు నష్టం దావా వేసిన సల్మాన్..ఎవరి మీదో తెలుసా ?

రిషబ్ పంత్ : –
మరోవైపు రిషబ్‌పంత్‌కు కూడా టెస్టు టీమ్ కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. యువ ఆటగాడైన పంత్‌కు బాధ్యతలు ఇస్తే ఎక్కువ కాలం కెప్టెన్సీగా కొనసాగే అవకాశముంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్​ కెప్టెన్‌గా పంత్​ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అయితే జట్టులో ఇంకా పూర్తిగా కుదురుకోకపోవడం అతనికి మైనస్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది. అలాగే సీనియర్లను కమాండ్‌ చేసే స్థాయిలో పంత్‌ లేడు… మరికొంత అనుభవం వస్తే కానీ పంత్‌కు సారధ్య బాధ్యతలు దక్కకపోవచ్చు.

Read More : India Covid-19 Vaccine : దేశంలో ఏడాది కాలంగా 156 కోట్ల మందికి వ్యాక్సిన్

జస్ప్రిత్ బుమ్రా : –
ఇటు బౌలర్ జస్ప్రిత్​ బుమ్రాకు కూడా టెస్టు టీమ్ కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో రాహుల్​ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించగా.. బుమ్రా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. బౌలింగ్‌ దళానికి నాయకత్వం వహించిన అనుభమం బుమ్రాకు ఉంది. అయితే గాయాలే బుమ్రాకు పెద్ద సమస్య. మరి BCCI ఏ నిర్ణయం తీసుకుంటుంది…? ప్రస్తుతానికి రోహిత్‌నే టెస్ట్‌ కెప్టెన్‌గా కొనసాగిస్తుందా..? లేక భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని యంగ్‌స్టర్స్‌కు ఛాన్స్ ఇస్తుందా అన్నది చూడాల్సి ఉంది.